పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ దేవుని లో మూడవ బాగం గ చెప్పవచ్చు.
దేవుడు ఒక్కడే అయితే మూడు స్వరుప్యాలు కలిగిన వారు. చాలామంది పరిశుద్ధాత్మ ను
స్త్రీ లింగముగా పిలుస్తారు కాని దేవుని వాక్యములో పరిశుద్ధాత్మ పురుషునిగా
సంబోధించడం జరిగింది. యోహాను 16: 7 - 8 లో యేసు వారు ఉత్తర వాది అని సంబోదించడం
వలన మనము దానిని గ్రహించ గలము. అయితే మనం పొరపాటుగా స్త్రీగా సంబోదించడం జరుగుతుంది.
పరిశుద్ధాత్మ దేవుడు ఆదిలో ఉన్నారు. ఆది 1:26 లో
మనము అని దేవుడు సంబోధించడం వలన మనం గ్రహించ గలము. మనము అనేది అనేకమందిని సూచిస్తుంది.
ఎలోహిం అనే పధం దేవుడు అనే పదానికి హిబ్రు మూలం. ఎలోహిం అనేది హిబ్రు డిక్షనరీ లో
బహువచనాన్ని సుచిస్తుంది. క్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని సంఘమునకు ఆదరణ కర్తగా
ఇవ్వనంత వరకు పాత నిబంధనలో పరోక్ష సేవలు
మనకు కనపడతాయి.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్ష క్రియలను ప్రవక్తలు ప్రవచించారు. ( యోవేలు 2: 28
- 29 ) క్రీస్తు వారు దానిని
ద్రుడపరిచారు.( యోహాను 16: 7 -8, అపోస్తులు 1:8 ). క్రైస్తవ విశ్వసి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్ష క్రియలను మూడు
విధాలుగా నాకు ప్రభువు వారు ప్రత్యక్ష పరిచారు.
1. పరిశుద్ధాత్మ సలహాలు, స్నేహుతుడు
యోహాను 16:8, ప్రకారం ఆయన మనుషుల పాపములను ఒప్పుకోన చేస్తారు.
మనషులు చేసే పాపమును గూర్చి పత్యతప పడునట్లు వారిని ప్రోత్యహిస్తారు. వారితో ఉండి
వారిని చెడు మార్గముల నుండి మల్లునట్లు ఒక స్నేహితునిగా ప్రోత్యహిస్తారు. యేసు
వారిని ప్రభువు గాను రక్షకుని గాను పరిచయం చేస్తారు (.1 కొరింది 12:3 ). ఒకవేళ అయన మాటకు విదేయుడవు కాకుండా పాపమును
ఒప్పుకోనకుండా ఉన్నట్లయితే, ఆయనను మనము అర్పివేయడం అవుతుంది. 1 దెస్స 5:19. ]. ఆయన
మాటకు లోబడి పాపమునుండి పత్యతాప పడి వాటిని ఒప్పుకుంటే ఒక స్నేహితునిగా మన పక్షాన
తండ్రి అయిన దేవునికి యుక్తమయిన ప్రార్ధన ఆయనే చేస్తారు.
2. పరిశుద్ధాత్మ
వరం,
పాపములు ఒప్పు కొనిన తరువాత,
దేవుని కనికరమును పొందుకుంటాడు మానవుడు. సామెతలు 28: 13. దేవుని కనికరము, కృప వలన మనుషుడు రక్షణ
పొందుకుంటున్నాడు. తీతు 3 : 5. రక్షణ అనేది అంతరంగములో జరిగే క్రియ. దానికి బహిరంగ
సాక్షము నీటి బాప్తిస్మము. అంతరంగములో దేవుని దగ్గర పాపములు ఒప్పుకుని ఆయనను
రక్షకునిగా అంగీకరించాను అని సమాజానికి తెలియ పరచడం బాప్తీస్మం. నేను చని పోయాను
క్రిస్తులో బ్రతికాను అనే సాధ్రుస్యాన్ని ఇవ్వడం.
అలా రక్షణ అనుభవం లోనికి వచ్చినప్పుడు
పరిశుధాత్మ దేవుడు విశ్వాసికి ఇచ్చే గొప్ప బహుమానం పరిశుధాత్మ వరం.
వరం అనే పదానికి హీబ్రూ లో పారితోషికం అనే
అర్ధం ఉంది. విశ్వసి పరిశుధాత్మ దేవుని మాట వినుట వలన మెచ్చి ఇచ్చే బహుమానం. ఒక
కంపెనీ లో పని చేసేవానికి తన పని తనాన్ని మెచ్చి, యాజమాన్యానికి విదేయుడగు విషయం
లో అతని నమ్మకత్వాన్ని మెచ్చి ఇచ్చే బహుమానం. పరిశుద్ధాత్మ దేవునికి విధేయుడగు
వానికి బహుమానాలు ఇష్తారు. వాటిని మరల వెనుకకు తీసుకొనే ప్రసక్తే లేదు. అవి 1
కొరింది 12 వ అధ్యాయం లో పొంది పరచి ఉంచారు ప్రభువు వారు పౌలు ద్వారా. బుద్ధి వాక్యము, జ్ఞానమును, విశ్వాసము, స్వస్తపరచు
వరము, అధ్బుతములు చేయు శక్తీ, ప్రవచన వరము, ఆత్మల వివేచనయు, భాషలు మాట్లాడు వరం, బాషలకు అర్ధము చెప్పు
శక్తీ, ఉపకారము చేయు వరము, ప్రభుత్వములు
చేయు వరం. ఈ వరాలు సేవకులకు మాత్రమె కాదు ప్రతి విశ్వాసికి పరిశుధాత్మ దేవుడు
అనుగ్రహిస్తారు. ఈ వరములు ఉన్నంత మాత్రాన
సేవకుడు కాదు.
3. పరిశుధాత్మ నింపుదల,
బాప్తీస్మం,
పైన చెప్పిన వారములు ఉన్నంత
మాత్రాన నీవు పరిశుద్ధాత్మ బాప్తీస్మం పొంది నట్లు కాదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం
అనేది బయట ఉండి నీకు సలహాలు బహుమానాలు ఇస్తున్న వక్తికి నీ మీద సంపూర్ణమయిన
అధికారం ఇవ్వడం, ఆయనను మనలో శాశ్వత నివాసిగా మార్చుకోవడం. అయన మనలను శక్తీ వంతులను
చేయుటయు, తన స్వాధీనములో ఉంచుకొనుట.
అపోస్తులు 4: 31, ఎఫే 5:18., యోహాను 14:17 , రోమ 8:9-11, 1 కొరింది ౩:16,
6:19, 1 యోహాను 4:4.,
నీటి బాప్తిస్మం ద్వారా సుద్ధి పరిస్తే, పరిశుధాత్మ బాప్తీస్మం నిన్ను దేవుని
రాజ్యంలోనికి నిన్ను తీసుకుని వస్తుంది. ఒక్క మాటలో పరిశుద్ధాత్మ బాప్తీస్మం అంటే
దేవుని స్వాధీనం లోకి వెళ్ళడం. అప్పుడు క్రీస్తు స్వరుప్యం మనలో ఏర్పడుతుంది.
అప్పుడు మనం అత్మఫలలు ఫలిస్తాము. గలతీ 5:22 ప్రేమ, సంతోషము, సమాధానము,
దీర్గశాంతము, ధయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వీకము, ఆశా నిగ్రహము. విశ్వసి
దేవుని చే నడిపించ బడతాడు. దేవునితో అంటూ కట్ట బడతాడు, తోటి విస్వాసులతో ఒక శరీరం
లోని అవయవముల వలె ఎకమవుతాడు. 1 కొరింది 12:13,రోమ 6:1 -4.
అయితే పరిశుధాత్మ దేవుడు
మనలోనికి వచ్చినప్పుడు, మానవుని ఆత్మ ను తన స్వాధీనము లోనికి తిసుకునినపుడు,
మానవుని ఆత్మ దేవుని ఆత్మ తో అనుసంధానం అయినప్పుడు మానవుని శరీరం దానిని
తట్టుకోలేదు. అగ్ని వంటి అనుబుతి కలుగుతుంది, అదే అగ్ని బాప్తీస్మం అని కూడా
అంటాము. నేను 2002 లో మా తండ్రి గారు 40 దినాలు
సంపూర్ణ ఉపవాసం ఉన్నప్పుడు, తెల్ల వారు జామున ప్రార్ధన సమయములో ఆ అగ్ని
బాప్తిస్మాన్ని పొందాను.
అపోస్తులు నాని బాబు నెల్లి
16 December 2019.
No comments:
Post a Comment