Showing posts with label praise. Show all posts
Showing posts with label praise. Show all posts

Saturday, December 14, 2019

సియోను







కీర్తనలు 132:  13 – 15. యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు. ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. దేవుడు సియోనును నివాసముగా, విశ్రమ స్థానముగా కోరుకుని నిత్సయించు కున్నాడు. సియోను దేవుని ఇంటిగా మారిపోయింది. దేవుడు ఆది నుండి మానవులతో కలసి ఉండాలని ఆశ పడేవారు ( నిర్గమ  25:8 ). అందుకే ఆదాము అవ్వలతో అయన సమయాన్ని గడిపేవారు. కాని వారు పాపం చెయ్యడం వలన దేవుడు వారితో ఉండలేక పోయారు. అయితే అయన ఈ భూమి మీద సియోనును మాత్రమె నివాస స్థలం అన్నారు. అది అక్కడ కొండలు నచ్చి కాదు. అక్కడ దావీదు ఏర్పరచిన నిత్య స్తుతి ఆరాధన ఆయనకు నచ్చి అక్కడ ఉంటాను అన్నారు. అయన అక్కడ ఉన్నారు కాబట్టి పట్టణంలో, అక్కడ ఆహారం సమృది గా ఉంచుతాను అన్నారు. అంటే అక్కడ వ్యవసాయం బాగా పండుతుంది, అంటే అక్కడ నీటి సమస్య లేదు, కొండ ప్రాంతం అయిన నీరు సమ్రుధిగా ఉంది, అంటే అక్కడ నిరుద్యోగ సమస్య లేదు, ఆకలి చావులు లేవు, బిధవాడే లేడు, సమృది అయిన ఐశ్వర్యం, నెమ్మది, క్షేమం. ఇంకా నీకు తెలిసినవి... మరి నీ ఇంట్లో ఎలా ఉంది...  నీ జీవితం లో ఎలా ఉంది? నీవు మారు మనస్సు పొంది దేవుని స్తుతించే కుటుంబం గా నీవు ఉంటె....  నీ ఇంటిని, సంఘాన్ని  అయన తన నివాస తలముగా మార్చు కుంటాడు. పైన చెపిన దీవెనల పంట నీవు కోతువు గాక!



షలోమ్
మీ కొరకు ప్రార్ధించే,
అపొస్తులు నాని బాబు నెల్లి,
source

Friday, December 13, 2019

దేవునికి మీ ఇంట్లో కుర్చీ వేసావా?




​ప్రియ సహోదరి సహోదరుడ, మన ఇంటికి వచ్చే ప్రతి అతిధి కి ఆతిద్యం ఇవ్వడం చాల ఇష్టమయిన పని. అది ఆశీర్వాద కరము కూడా. అయితే సర్వసృష్టి కర్తకు ఆతిద్యం ఇవ్వడం అంటే మనకు ఇంకెంత ఆశీర్వాదం. మరి అయన మనతోనే ఉండాలి అని అసపడుతున్నారు. కాని మనం ఆయనకు సరిఅయిన రీతిలో ఆతిద్యం ఇవ్వడం మానేసి,. కానిసం  ఆయనకు కూర్చోడానికి ఒక కుర్చీ కూడా వెయ్యకుండా మన కోరికలన్నీ అయన ముందర పెట్టేస్తాం. కాని అసలైన విషయం ఏమిటి అంటే  పరిశుద్ధ గ్రంధం లో ఒక మాట ఉంది. మన అవసారాలన్ని మనం అడగక ముందే ఆయనకు తెలుసు. ప్రార్ధన అంటే మాట్లాడటం, అయన పాదాల వద్ద కూర్చోవడం. అంటే ముందు ఆయనకు ఒక కుర్చీ వెయ్యలిగా? మరి ఆయనకు కుర్చీ వేసారా? వెంటనే మన ఇంట్లో ఒక పక్కన ఒక కుర్చీ వెయ్యడం కాదు. బైబిల్ లో ఆయనకు కుర్చీ అంటే ఏంటో చెప్పారు. కీర్తన 22:3 లో “నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసినుడవై యున్నావు” అని వ్రాసి ఉంది. అంటే దేవునికి నీవు వెయ్యాల్సింది చెక్క కుర్చీ, స్టీల్ కుర్చీ, మడత కుర్చీ, స్పంజి కుర్చీ కాదు. ఆయనకు వెయ్యాల్సింది స్తుతి అనే కుర్చీ. అది వెయ్యగలిగితే అయన నీవు ఉన్న ప్రతి చోట అది ఆఫీస్, ఇల్లు, రోడ్, పని చేసే చోట, ఏదైనా సరే  నీ ప్రక్కనే అయన కుర్చుని ఉంటారు. అయన నీ ప్రక్కనే ఉంటారు... స్తుతి చెయ్యడం మొదలు పెడతావా? నీ నోటిలో స్తుతి ఉంటె నీ పరిస్థుతులలో యేసువారు ఉంటారు. సర్వశక్తి కలిగిన దేవుడే నీ ప్రక్కనే ఉన్నారు దేనికి భయం ఇకా? ప్రభువు నీవు చేసే స్తుతుల మీద అసీనుడు అయ్యి నీ పక్షాన ఉండును గాక?
షలోం.
మీ కొరకు ప్రార్ధించే
అపొస్తులు నాని బాబు నెల్లి
source

Wednesday, January 23, 2019

స్తుతి ప్రార్ధన యొక్క ప్రభావ శక్తి నిరూపణ

ప్రియ దైవ జనులకు మీ జత పని వాడనైన క్రీస్తు దాసుడను, మరియు తోటి క్రైస్తవ సహోదరి సహోదరులకు అపోస్తుల పిలుపుతో దేవుని సేవను కొనసాగిస్తున్న నాని బాబు నెల్లి భారముతో, హృదయ పూర్వక వందనములతో వ్రాయునది.​ఒక యదార్ధ విషయాన్ని  మీకు తెలియ జేయాలని ఆశ పడుతున్నాను. ఎస్తేరు ప్రాజెక్ట్ వారు ప్రచురించిన లెక్కల ప్రకారం 2016 లో 361 సఘంపై దాడులు నమోదు చేయ బడ్డాయి, 2016 నుండి సంఘం మీదకు శ్రమలు ఇంతకు ముందు కంటే  20%  పెరిగాయి, మరియు ప్రతి 40 గంటలకు ఒక సంఘ వ్యతిరేక సంఘటన జరుగుతుంది.  CBN NEWS ప్రకారం  2017  లో అర్ధ సంవత్సరనికే జరిగిన సంఘటనలు  2016  లో మొత్తం  జరిగిన సంఘటనలు తో సమానం. మరియు ఓపెన్ డోర్ వారి 2018 వాచ్ లిస్టు నందు ప్రపంచంలో 50 అతిగా క్రైస్తవ సమాజం హింసింప దేశాల జాబిత లో మన దేశం 11 వ స్థానం లో ఉంది.  ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగ చెప్పబడుచున్న మన దేశం లో ఇలా సంఘ వ్యతిరేక దాడులు జరగడం చాల అవమానకరం. మన దేశంలోని పరిస్థుతులు  ఇలా క్రైస్తవ సమాజానికి సంఘానికి సేవకు విరుధం గా మారుతున్నాయి. రాబోయే కాలం లో ఈలాంటి పరిస్థితి కొనసాగితే దేవుని సేవ చేయుటకు, ప్రభువును భాహిరంగంగా స్తుతించడానికి అవకాశాలు ఉండక పోవొచ్చు.
మరో మంచి ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. 2011 నుంది ఉతర కొరియా ను పాలించిన కిమ్ జోంగ్ ఉన్  ఎంతటి నియంతో, ఆ దేశాన్ని ఎల పాలించాడో,  ప్రపంచ పోలీస్ గా, శక్తీ వంత మయిన దేశం అమెరికా మీదకు ఎలా కాలు దువ్వాడో మనకు తెలిసిందే కాని మనకు తెలియని ఒక విషయం, అక్కడ క్రైస్తవ సమజాన్ని అతడు చిత్ర హింసలకు గురి చేసాడు. అనేక మంది వారి విశ్వాసం కోసం ప్రాణాలు బలి పెట్టారు, అక్కడ సంఘం కటిన  హింసలు అనుభవించారు, తాగడానికి నీళ్ళు లేక, సరియయిన వైద్య అందక జైల్లో చిత్ర హింసలకు గురి అయ్యారు. అయితే అద్బుత మయిన విషయం ఏమిటి అంటే హింస కాలం లోనే అక్కడ సంఘం 5 రెట్లు వృద్ది అయ్యింది. జూన్ 12 న జరిగిన అమెరికా ఉతర కొరియా ల ఒప్పందం వలన మరల సంఘానికి స్వేచ్చ కలిగింది. దానికి వారు చేసిన పనేంటో తెలుసా ప్రార్ధన.
ప్రార్ధనా వారికి కరడు గట్టిన నియంత నుండి స్వేచ్చ ను తీసుకు రాగలిగింది. ప్రార్ధనా అమెరికా పాలకులలో శాంతి భావాన్ని కలిగించి తిరుగు బాటు చేసినా శాంతిగా ఒప్పందం కుదుర్చుకునే టట్టు చేయగలిగింది. కిమ్ జోంగ్ ఉన్ మనస్సును మార్చగలిగింది. దేవుని సహాయాన్ని పొందుకునే టట్టు చేసింది. ఎక్కడైతే ప్రార్ధాన, స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు ఆశినుడు అవుతాడు.ఆశినుడు అంటే కూర్చోవడం, వాక్యం లో చెప్పినట్టు మన స్తుతులే ఆయన కూర్చోడానికి సింహాసనం ( కీర్త 22 :3 ) . అయన అసినుడు అయిన చోట అయన కాళ్ళ క్రింద ఒక పాద పీటం ఉంటుంది. అదేంటో తెలుసా అయన శత్రువులు (కీర్త 110 ). అయన కు మనం సింహాసనం వెయ్య గలిగితే అయన శత్రువు, సంఘ వ్యతిరేకులును అయన పాద పీటం గ చేసుకుంటాడు. ఆయనను సేవించు వారిని తన ప్రక్కన కూర్చుండ బెట్టుకుంటాడు. అంతే కాదు మన శత్రువులను మను పాద పీటము గా చెయ్య గలడు. అయితే మనం ఆయనకు ఒక సింహాసనం వెయ్యాలి.
పరలోకం లో ఆయనకు ఒక సింహాసనం  ఉంది. ఆయనను మనం భూమి మీదకు తీసుకుని రాగలిగిన ఒకే ఒక్క మార్గం అది పరలోక మాదిరి  స్తుతి, ఆరాధన. ఆదే ఆయనకు ఒక సింహసనం. ప్రభువు తన వాక్యం లో నేను సియోను వాసిని అన్నారు. అంటే అయన సియోనులో సింహసనసినుడు అయ్యారు. ఎందుకంటే సియోనులో దావీదు ఒక గుడారాన్ని కట్టి అక్కడ పరలోక మాదిరి  నిత్య స్తుతి ఆరాధన క్రమాన్ని స్థాపించాడు.
ఈరోజు మనం కూడా అలాంటి ఎడతెగని స్తుతి ఆరాధన స్థాపించ గలిగితే అయనకు  మన దేశం లో, మన రాష్ట్రం లో, మన జిల్లాలో ఒక సింహాసనాన్ని వెయ గళం. ఆ సింహాసనాన్ని సిధపరచ డానికె  ఇండియా ప్రేయర్ లీగ్ స్థాపించా బడింది. ఇప్పటికే 64 సంఘాలు తూర్పు, పచ్చిమ గోదావరి, గుంటూరు  జిల్లా ల నుండి, 20 సంఘాలు కలకత్తా, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుండి  ఇందులో పాలి భాగస్తులై ఉన్నారు. మీరును కూడా ఇందులో పాలి భాగస్తులై భారత దేశ క్షేమం కొరకు మన దేవునికి ఒక సింహాసనాన్ని సిద్ధపరుచుధాం . అందుకు మీరు చేయాల్సినది నెలలో సంఘముగా అయితే  ఒక రోజు లేక  వ్యక్తి గతం గా అయితే  ఒక గంట / అర గంట  సమయం కేటాయించాడం. మీరు కేటాయించిన సమయానికి మీరు ఉన్న స్థలములో ఉండి ప్రార్ధనలో ఉంటె చాలు. అవ్విధముగా నెలలోని 30 దినములు, 72౦ గంటలు ఎడతెగని స్తుతి ఆరాధనా జరుగుతుంది.
ఇప్పటికే అనేకులు స్తుస్తితూ ప్రార్ధిస్తున్నారు. మీ ఫోన్ నుండి ఒక మిసిడ్ కాల్ గాని, మీరు ప్రార్ధించే సమయం మెసేజ్ గాని చేయుట ద్వార మాకు మీ అంగికారని తెలియ జేయండి. కలసి దేవుని సన్నిధిని అనుభవిద్దాము, అలగే మీ ప్రార్ధనా అవసరతలు ఉంటె మాకు తెలియ జేయండి మనతో కలసి ప్రార్ధించే వారికి మీ అవసరత తెలియ పరుస్తాము. ప్రతి గంటకు మీ నిమిత్తం ప్రార్ధనాలో దేవుని ఎదుట ప్రస్తావించ బడుతుంది.
ప్రభువు సేవలో,అపొస్తులు నాని బాబు నెల్లి,స్థాపితులు,
ఇండియా ప్రేయర్ లీగ్,
7989 744 799HTTPS://WWW.1CHURCH1DAY.ORG/INDIA-PRAYER-LEAGUE.HTMLx