Showing posts with label ముహూర్తం. Show all posts
Showing posts with label ముహూర్తం. Show all posts

Tuesday, December 17, 2019

ముహూర్తం




బారతీయ ప్రజల రక్తంలో కలిసిపోయిన ఒక అలవాటు ముహూర్తం. అంటే పని చెయ్యడానికి మంచి గడియలు, మంచి సమయం. అయితే క్రైస్తవులు ముహర్తం చూడవచ్చా?  దేవుని వాక్యం లో ఒక మాట  అపోస్తులు 1: 7 కాలములను సమయములను తండ్రి స్వాదీనమందుంచుకొని యున్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. దానియేలు 2: 21 అయన కాలములను సమయములను మార్చువాడై యుండి... ఆయన చేతులో నుండి సమయాలను మనం దొంగిలించాగలమా? అయన వాటిని మార్చుటకు సమర్ధుడు కదా? వాక్యాన్ని బట్టి మనం సమయాలను ఇది మంచిది అని చెడ్డది అని గాని నిర్ణయించలేము.  అయన సమయాలను మార్చగలిగిన వాడు. అందుకే గమనించండి, ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకున్న వారిలో ఎంతమంది సంతోషంగా ఉండగులుగుతున్నారు? ఎంతమంది కలసి ఉంటున్నారు? ఎంతమంది పిల్లల్ని కలిగి ఉన్నారు? ఎంతమంది సుఖంగా ప్రయాణాలు చేస్తున్నారు? వీరంతా ముహూర్తాలు చూసుకునే కదా ఇవన్నీ చేసేది. ఇదంతా సమయాల మీద నమ్మకం కలిగించి మనము దేవుని మీద కలిగి ఉన్న విశ్వాసము ను సంకించడానికే. ఎప్పుడైతే నమ్మకం సమయాల మీద ఉందో మనం దేవుని మీద భారం వెయ్యలేము, అయన సామర్ద్యాన్ని సంకిన్చినట్లేగా! అబ్రహాము ను పిలిచినప్పుడు తను సమయాన్ని చూడలేదు, ధావిదును అభిషేకించేటప్పుడు సముయేలు సమయాన్ని చూడలేదు, మోషేను ఎర్ర సముద్రం మీద చెయ్యి చాపమన్నప్పుడు సమయాన్ని చూడలేదు, పేతురు నీటిమీద నడవడానికి సమయాన్ని చూడలేదు, వీరంతా సమయం అనుకుని కుర్చుని ఉంటె దేవుని కార్యాన్ని చూసి ఉండేవారు కాదు. వారి జీవితం లో దేవుడు కార్యాలు చెయ్యలేదా? నీవు పుట్టునప్పుడు సమయం చూసుకుని పుట్టలేదు, మరణం లో సమయమ లేదు కదా? మనషే అనే రాజు ముహూర్తములు విచారించుచు దేవునికి కోపం పుట్టించాడు. శత్రువుల చేతికి చిక్కి బాబులోనుకు గొలుసులతో తీసుకుని పోబడ్డాడు. 2 దిన 33: 1 -13 . గలతి 4:10 మీరు దినములను, మాసములను,.......ఆచరించుచున్నారు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్ధమై పోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుతున్నాను. అంటే మీరు దేవునికి దురం అయిపోతారేమో, దేవుని కోపానికి గురి అవుతారేమో  అనే భయం పౌలు లో ఉంది... ఈరోజు చాల మంది సేవకులలో ఉంది.... మరి నీకు ఉందా ఆ భయం.... సాతాను సులువుగా చిక్కుల పెట్టు తంత్రములలో నుండి ప్రభువు మిమ్మును కాపాడును గాక!

షలోమ్

మీకోరకు ప్రార్ధించే              
అపోస్తులు నెల్లి  నాని బాబు
Source