Showing posts with label Illustration. Show all posts
Showing posts with label Illustration. Show all posts

Thursday, December 19, 2019

ఆరాధన ఎలా చేస్తున్నావు? జాగ్రత్త



పాత మతాల స్థానం లోనికి క్రైస్తవ్యం వచ్చె క్రమంలో క్రైస్తవ్యం మతమై పోయింది. ( Alexander Schmemann, 20th century Eastern Orthodox Priest, teacher, and Writer ). క్రైస్తవ్యం మతానికి అతీతమయినది, మారడానికి ఇది వేరే మతం కాదు. పారసికుల, యూదుల పాలన సమయాలయిన  రోమన్ కాతోలిక్ సంఘం రుపొందించబడిన 4-6 శతాబ్దాలలో క్రైస్తవ్యం లోనికి మతపరమయిన అలవాట్లు ప్రవేశించాయి. అప్పటి వరకు  క్రైస్తవ్యం ఒక మార్గం, ఒక విశ్వాసం, నిరీక్షణ, ఐక్యత, ప్రేమ గా క్రీస్తే గురిగా ఉండేవారు. కాని ప్రస్తుత రోజుల్లో క్రైస్తవ్యం లోనికి వదిల వచ్చిన పాత మతాల అలవాట్లు కలగలిపి ఆరాధన చేస్తున్నారు. అందుకే ప్రభువు వారు చెపుతున్నారు యెషయ 29:13d వారు నాయెడల చూపు భయబక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. మత్తయి 15: 6 మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. దేనినుండి అయితే ప్రభువు మానవ జాతిని విడిపించారో మరల ఆ పిత్రు పారంపర ఆచారాలు, పద్ధతులు, క్రమాలు, కట్టుదిట్టమయిన కట్టుబాట్లు మరల సంఘం లోనికి మెల్లగా ప్రవేశించి మొత్తాన్ని అక్రమించేసుకున్నాయి. "గలతీ 5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకోనకుడి". ప్రియ సహోదరుడ ఈరోజు నీ క్రైస్తవ్యం ఎటువైపు క్రిస్తు వాలే నడచే క్రీస్తు వారసుడవా? ఆచారాల క్రైస్తవుడవా?

షలోమ్.
మీకోరకు ప్రార్ధించే           
అపోస్తులు నెల్లి  నాని బాబు
( source ) 

Wednesday, December 11, 2019

పుట్టబోయే బిడ్డ కోసం తల్లి ప్రేమ ఎంచేసిందో తెలుసా?





ఇంగ్లాండ్ దేశానికి చెందిన లోరైని అల్లర్డ్ 33 సంవత్సరాలు వయసులో గర్భవతిగా ఉంది. ఆ వయసులో అనుకోని బలహీనతల వలన వైద్యుని దగ్గరకు వెళ్తే తనకు కాలేయపు  కాన్సర్ ఉంది అని చెప్పారు. డాక్టర్ గారు తనకు వైద్యం వెంటనే అందించాలని, అప్పటికే అది బాగా పాకి కాలేయం లో గడ్డలు మారింది అని చెప్పారు. అయితే అప్పటికే గర్భంలో బిడ్డ ఉన్నాడు. వైద్యం జరిగితే మందుల ప్రభావం బిడ్డమిధ ఉంటుంది కాబట్టి అబర్సన్ చేయాలి అన్నారు. అయితే ఆ తల్లి ఒప్పుకోలేదు, అంతేకాదు బిడ్డ గర్భం లో ఉన్నంతకాలం కాన్సర్ మందులు వేసుకోలేదు. నేను చనిపోతే నా బిడ్డ బ్రతుకుతాడు ని ధైర్యం గా చెప్పగలిగింది.  ఆ సంవత్సరం 24 న  ఒక కుమారునికి జన్మమును నిచ్చింది. 2 నెలలకు  ఆమె చనిపోయింది. డాక్టర్స్ పుట్టిన బిడ్డకు ఏమైనా వ్యాధి సోకిందేమో అని బయపడి, పరిక్షలు చేయగా అద్బుతంగా పిల్లవాడు సంపూర్ణ మయిన ఆరోగ్య వంతునిగా ఉన్నాడు. అతనికి వ్యాధి సోకలేదు. అలాగే 2000 సంవత్సరాల క్రితం నీకొరకు నా కొరకు మన సమస్యలలో పాలివాడై, మన పాప బారం తొలగించడానికి తన ప్రానమునే ఫణంగా పెట్టి మనలను పవిత్ర పరిచాడు, అయన మన బరం అంత మోశారు, మనలను పవిత్రులను చేసాడు.  రోమ 8: ! కాబట్టి యిప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షయు విధియు లేదు.

​మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నాని బాబు నెల్లి,
source