Showing posts with label worship. Show all posts
Showing posts with label worship. Show all posts

Sunday, December 22, 2019

మందిరానికి ఏప్పుడు వెళ్ళాలి?


ఈరోజు పునరుధాన దినం ఆరాధనా రోజు, కుటుంబముగా కలసి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారని అసిస్తున్నాను. యొహోషువ అన్నట్టు నేనును నా ఇంటివారును యెహోవాను సేవించేధము, అనుకుంటూ వెళ్తున్నారని ప్రార్ధిస్తున్నాను.  అయితే ప్రార్ధనకు ఏప్పుడు వెళ్తున్నారు అనేది ఒక ప్రాముఖ్యమయింది.  చాల మంది పనులు చక్కపెట్టుకుని, చుట్టాలను చక్కపెట్టి, వారమంతా మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేసుకుని పాటలు అయిపోయకో, స్తుతి ఆరాధన అయిపోయకో, ప్రసంగం సగం అయిపోయకో వెళ్ళడం అలవాటుగా మారిపోయింది కొంతమందికి. కాని వాక్యాన్ని బట్టి చూస్తే మందిరానికి ఆసక్తితో వెళ్ళాలి అని అర్ధం అవుతుంది. ఆసక్తి అంటే ఉదాహరణకు మనకు ఇష్టమయిన టీవీ ప్రోగ్రాం చూడటానికి సిద్ధపడినట్టు, ఉద్యోగానికి వెళ్లినట్టు, అలాగే ఇంటికి చుట్టం వస్తే ఎదురు చూస్తున్నట్టు, అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ కలవాడానికి వెళ్లినట్టు.  వీటన్నిటికి ఇచ్చినంత కంటే ఎక్కువ ప్రాధాన్యత మందిరానికి ఇవ్వలేకపోతున్నాము. కారణం మందిరం అంటే చులకన భావం. వాక్యం చెపుతుంది ఆరాధన జరిగే స్థలములో దేవుడు నిలిచి ఉంటాడు. మరి అయన పైవారందరి కంటే గొప్పవాడు కాదా? మరి అలాంటప్పుడు ఇంకెంత శ్రద్ధతో మందిరానికి వెళ్ళాలి. అందుకే వాక్యం లో రెండు వచనాలు చూద్దాం. ఒకటి లూకా 21:38 ప్రజలందరు ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. అలాగే మనకు మాదిరి వదిలిన యేసువారు ఏమిచేసారో కుడా చూద్దాం... యోహాను 12: 1 కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. యేసు వారు మందిరం లో జరిగే పండుగకు ముదుగా వెళ్లారు, ప్రజలు ఆయన వాక్యం వినడానికి ముందుగా, పెందలకడనే వచ్చారు. మరి నీవు ఎలా వెళ్తున్నావు? అది క్రమమేనా? అది నీకు దీవెన తెచ్చిపెడుతుందా? ఎశావు తండ్రికి ఆహారం తేవడం ఆలస్యం అయ్యింది, నాది నాకు ఉంటుందిలే అనుకున్నాడు, ఇంతలో ఆసిర్వదాలన్ని తమ్ముడు పట్టుకుని వెళ్ళిపోయాడు,  ఇక మిగిలింది.  పైన చెప్పిన వాటన్నిటికీ కుదురుతున్న సమయం దినికేందుకు కుదరదు? కుదురుతుంది. అలా సిద్ధపడి పెందలకడనే, ప్రారంబ ప్రార్ధనకు ముందుగానే  వెళ్లి దైవ దీవెనలు పొందగలరని ఆసిస్తూ.....

షలోమ్

మీకోరకు ప్రార్ధించే               
అపోస్తులు నెల్లి  నాని బాబు 


Sunday, December 15, 2019

మందిరం లోనికి పురుగులు మరలా రాలేదు?




ఒక సేవకుల సహవాసం లో కొంతమంది సేవకులు వారి మందిరాలు గురుంచి మాట్లాడుకుంటూ, మందిరాలలోనికి పురుగులు రావడం గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధముగా ఎంత ప్రయత్నాలు చేసినా పురుగులు పోవడం లేదని చెప్పుకుంటున్నారు. అయితే అక్కడ ఒక పాస్టర్ గారు మాత్రం అసలు ఏవిధమయిన చింత లేకుండా కుర్చుని ఉండటం చూసి మీకు పురుగులు బెడద లేదా అని అడిగారు. అందుకు పాస్టర్ గారు మీ అందరికంటే ఎక్కువ ఉండేవి, కాని ఇప్పుడు రావడం లేదు అన్నారు అట. అంతే అందరి చూపులు ఈ పాస్టర్ గారి వైపు తిరిగిపోయాయి. ఏమి చేసారు పురుగులు రాకుండా.. పాస్టర్ చాల ప్రశాంతంగా లోపలి వచ్చిన వాటికేల్ల బాప్తిస్మం ఇచ్చేస్తున్నాను. అన్నరంట... ఈరోజుల్లో సంఘం ఇలానే ఉంది.. దేవునిలోనికి వచ్చిన క్రొత్తలో అసలు మందిరం విడువకుండా ప్రార్ధనకు వచ్చేస్తారు... కాని బాప్తిస్మాలు పొందాక అసలు మందిరానికి రావడం మానేస్తుంటారు.... అందుకే వాక్యం చెపుతుంది. కొందరు మానుకోను చున్నట్టుగా సమాజముగా కూడుట మానక ...... ఆ దినము సమీపించుట మీరు చుసిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు.... హెబ్రీ 10:25, వీరు అపోస్తులుల బోధ యందును సహవాస మందును, రొట్టె విరచుట యందును ప్రార్ధన చేయుట యందును ఏడ తెగక యుండిరి. అపోస్తులు 2: 42. మనం ప్రభువు కోరుకునిన సంఘముగా విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఉందాం...

షలోమ్
మీకొరకుప్రార్ధించే
అపోస్తులునెల్లినానిబాబు
source

Wednesday, January 23, 2019

స్తుతి ప్రార్ధన యొక్క ప్రభావ శక్తి నిరూపణ

ప్రియ దైవ జనులకు మీ జత పని వాడనైన క్రీస్తు దాసుడను, మరియు తోటి క్రైస్తవ సహోదరి సహోదరులకు అపోస్తుల పిలుపుతో దేవుని సేవను కొనసాగిస్తున్న నాని బాబు నెల్లి భారముతో, హృదయ పూర్వక వందనములతో వ్రాయునది.​ఒక యదార్ధ విషయాన్ని  మీకు తెలియ జేయాలని ఆశ పడుతున్నాను. ఎస్తేరు ప్రాజెక్ట్ వారు ప్రచురించిన లెక్కల ప్రకారం 2016 లో 361 సఘంపై దాడులు నమోదు చేయ బడ్డాయి, 2016 నుండి సంఘం మీదకు శ్రమలు ఇంతకు ముందు కంటే  20%  పెరిగాయి, మరియు ప్రతి 40 గంటలకు ఒక సంఘ వ్యతిరేక సంఘటన జరుగుతుంది.  CBN NEWS ప్రకారం  2017  లో అర్ధ సంవత్సరనికే జరిగిన సంఘటనలు  2016  లో మొత్తం  జరిగిన సంఘటనలు తో సమానం. మరియు ఓపెన్ డోర్ వారి 2018 వాచ్ లిస్టు నందు ప్రపంచంలో 50 అతిగా క్రైస్తవ సమాజం హింసింప దేశాల జాబిత లో మన దేశం 11 వ స్థానం లో ఉంది.  ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగ చెప్పబడుచున్న మన దేశం లో ఇలా సంఘ వ్యతిరేక దాడులు జరగడం చాల అవమానకరం. మన దేశంలోని పరిస్థుతులు  ఇలా క్రైస్తవ సమాజానికి సంఘానికి సేవకు విరుధం గా మారుతున్నాయి. రాబోయే కాలం లో ఈలాంటి పరిస్థితి కొనసాగితే దేవుని సేవ చేయుటకు, ప్రభువును భాహిరంగంగా స్తుతించడానికి అవకాశాలు ఉండక పోవొచ్చు.
మరో మంచి ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. 2011 నుంది ఉతర కొరియా ను పాలించిన కిమ్ జోంగ్ ఉన్  ఎంతటి నియంతో, ఆ దేశాన్ని ఎల పాలించాడో,  ప్రపంచ పోలీస్ గా, శక్తీ వంత మయిన దేశం అమెరికా మీదకు ఎలా కాలు దువ్వాడో మనకు తెలిసిందే కాని మనకు తెలియని ఒక విషయం, అక్కడ క్రైస్తవ సమజాన్ని అతడు చిత్ర హింసలకు గురి చేసాడు. అనేక మంది వారి విశ్వాసం కోసం ప్రాణాలు బలి పెట్టారు, అక్కడ సంఘం కటిన  హింసలు అనుభవించారు, తాగడానికి నీళ్ళు లేక, సరియయిన వైద్య అందక జైల్లో చిత్ర హింసలకు గురి అయ్యారు. అయితే అద్బుత మయిన విషయం ఏమిటి అంటే హింస కాలం లోనే అక్కడ సంఘం 5 రెట్లు వృద్ది అయ్యింది. జూన్ 12 న జరిగిన అమెరికా ఉతర కొరియా ల ఒప్పందం వలన మరల సంఘానికి స్వేచ్చ కలిగింది. దానికి వారు చేసిన పనేంటో తెలుసా ప్రార్ధన.
ప్రార్ధనా వారికి కరడు గట్టిన నియంత నుండి స్వేచ్చ ను తీసుకు రాగలిగింది. ప్రార్ధనా అమెరికా పాలకులలో శాంతి భావాన్ని కలిగించి తిరుగు బాటు చేసినా శాంతిగా ఒప్పందం కుదుర్చుకునే టట్టు చేయగలిగింది. కిమ్ జోంగ్ ఉన్ మనస్సును మార్చగలిగింది. దేవుని సహాయాన్ని పొందుకునే టట్టు చేసింది. ఎక్కడైతే ప్రార్ధాన, స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు ఆశినుడు అవుతాడు.ఆశినుడు అంటే కూర్చోవడం, వాక్యం లో చెప్పినట్టు మన స్తుతులే ఆయన కూర్చోడానికి సింహాసనం ( కీర్త 22 :3 ) . అయన అసినుడు అయిన చోట అయన కాళ్ళ క్రింద ఒక పాద పీటం ఉంటుంది. అదేంటో తెలుసా అయన శత్రువులు (కీర్త 110 ). అయన కు మనం సింహాసనం వెయ్య గలిగితే అయన శత్రువు, సంఘ వ్యతిరేకులును అయన పాద పీటం గ చేసుకుంటాడు. ఆయనను సేవించు వారిని తన ప్రక్కన కూర్చుండ బెట్టుకుంటాడు. అంతే కాదు మన శత్రువులను మను పాద పీటము గా చెయ్య గలడు. అయితే మనం ఆయనకు ఒక సింహాసనం వెయ్యాలి.
పరలోకం లో ఆయనకు ఒక సింహాసనం  ఉంది. ఆయనను మనం భూమి మీదకు తీసుకుని రాగలిగిన ఒకే ఒక్క మార్గం అది పరలోక మాదిరి  స్తుతి, ఆరాధన. ఆదే ఆయనకు ఒక సింహసనం. ప్రభువు తన వాక్యం లో నేను సియోను వాసిని అన్నారు. అంటే అయన సియోనులో సింహసనసినుడు అయ్యారు. ఎందుకంటే సియోనులో దావీదు ఒక గుడారాన్ని కట్టి అక్కడ పరలోక మాదిరి  నిత్య స్తుతి ఆరాధన క్రమాన్ని స్థాపించాడు.
ఈరోజు మనం కూడా అలాంటి ఎడతెగని స్తుతి ఆరాధన స్థాపించ గలిగితే అయనకు  మన దేశం లో, మన రాష్ట్రం లో, మన జిల్లాలో ఒక సింహాసనాన్ని వెయ గళం. ఆ సింహాసనాన్ని సిధపరచ డానికె  ఇండియా ప్రేయర్ లీగ్ స్థాపించా బడింది. ఇప్పటికే 64 సంఘాలు తూర్పు, పచ్చిమ గోదావరి, గుంటూరు  జిల్లా ల నుండి, 20 సంఘాలు కలకత్తా, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుండి  ఇందులో పాలి భాగస్తులై ఉన్నారు. మీరును కూడా ఇందులో పాలి భాగస్తులై భారత దేశ క్షేమం కొరకు మన దేవునికి ఒక సింహాసనాన్ని సిద్ధపరుచుధాం . అందుకు మీరు చేయాల్సినది నెలలో సంఘముగా అయితే  ఒక రోజు లేక  వ్యక్తి గతం గా అయితే  ఒక గంట / అర గంట  సమయం కేటాయించాడం. మీరు కేటాయించిన సమయానికి మీరు ఉన్న స్థలములో ఉండి ప్రార్ధనలో ఉంటె చాలు. అవ్విధముగా నెలలోని 30 దినములు, 72౦ గంటలు ఎడతెగని స్తుతి ఆరాధనా జరుగుతుంది.
ఇప్పటికే అనేకులు స్తుస్తితూ ప్రార్ధిస్తున్నారు. మీ ఫోన్ నుండి ఒక మిసిడ్ కాల్ గాని, మీరు ప్రార్ధించే సమయం మెసేజ్ గాని చేయుట ద్వార మాకు మీ అంగికారని తెలియ జేయండి. కలసి దేవుని సన్నిధిని అనుభవిద్దాము, అలగే మీ ప్రార్ధనా అవసరతలు ఉంటె మాకు తెలియ జేయండి మనతో కలసి ప్రార్ధించే వారికి మీ అవసరత తెలియ పరుస్తాము. ప్రతి గంటకు మీ నిమిత్తం ప్రార్ధనాలో దేవుని ఎదుట ప్రస్తావించ బడుతుంది.
ప్రభువు సేవలో,అపొస్తులు నాని బాబు నెల్లి,స్థాపితులు,
ఇండియా ప్రేయర్ లీగ్,
7989 744 799HTTPS://WWW.1CHURCH1DAY.ORG/INDIA-PRAYER-LEAGUE.HTMLx