Showing posts with label illustrations. Show all posts
Showing posts with label illustrations. Show all posts

Friday, December 20, 2019

కుటుంబం లో నమ్మకత్వం




ఈరోజుల్లో మానవుని లో బాగా కరువైపోతుంది నమ్మకత్వం. అదువల్లె ఏ చిన్న విషయానికైనా  నోట్ లు, కాల్ రికార్డింగ్ లు, వీడియో లు, ఇద్దరు ముగ్గురు సాక్షులు కావలసి వస్తుంది. ఇంకా ఆలోచిస్తే కుటుంబాలలో కూడా ఇది కరువైపోతుంది. ఒక విచిత్రమైన సంగటన మీకు చెపుతాను. మునిమనవల్లను ఎత్తుకుని కాలక్షేపంగా సమయాన్ని గడపాల్సిన 99, 96 సంవత్సరాల ఇటలి  వృద్ధ దంపతులు అంటోనియో సి., రోసా సి. కోర్టు మెట్లు ఎక్కారు. ఎందుకో తెలుసా? 1940 లో బార్య కలిగిన అక్రమసంబంధం గురుంచి తెలిసి పెళ్ళైన 77 సంవత్సారాల తరువాత విడాకులు తీసుకుని ప్రపంచం లోనే విడాకులు తీసుకున్న వృద్ధ దంపతులుగా నమోదయ్యారు. నమ్మకత్వం అనేది చాలవిలువైన లక్షణం, అది కొనలేము, పొందుకోవాలి, కాపాడుకోవాలి. ఒక్కసారి కోల్పోతే మరల దానిని పొందుకోవడం అసంభవం. నమ్మకాలు కోల్పోయిన బార్య భర్తల మధ్య ఉండేది ప్రేమ కాదు నటనా జీవితం. ప్రతి మాట, ప్రతి క్రియ ఒక నటనే.... ఒకసారి అలోసించండి, మీ జీవితాకాలం మీరిద్దరే కలసి బ్రతకాలి, ఒకే ఇంట్లో,ఒకే గదిలో, ఒకే బోజన గదిలో కలసి సచ్చేవరకు ఉండాలి, కలసి ప్రయాణాలు, కలసి నిర్ణయాలు తీసుకోవాలి, కుదురుతుందా ఇదంతా నటనతో?  నమ్మకత్వాన్ని కోల్పోయే ఏవిధమైన క్రియ అయిన దాయ బడదు ఒక రోజు నీముందు నిలబడుతుంది. లూకా 8:17 తేట పరచబడని రహస్యమేదియు లేదు; తెలియజేయబడకయు బయలు పడకయు నుండు మరుగైనదేదియు లేదు. అప్పుడు నీవు తల ఎత్తుకుని నిలబదగలవా? దానికి ప్రతిఫలం పొందే సమయం లో నీవు ఒర్వగలవా? అవమానము సహించగలవా? అందుకే వాక్యం చెపుతుంది. మరణము వరకు నమ్మకముగా ఉండుము. ప్రకటన 2:10.., నమ్మకమయిన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28:20. అయన వెక్కిరింప బడడు. ఆయనే నీకు ప్రతిఫలము ఇస్తారు. నిజమైన ప్రేమను పొందుకుని ఆనదంగా మీరు మీ కుటుంభం ఉండును గాక!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే           
అపోస్తులు నెల్లి  నాని బాబు

( source ) 

Thursday, December 19, 2019

ఆరాధన ఎలా చేస్తున్నావు? జాగ్రత్త



పాత మతాల స్థానం లోనికి క్రైస్తవ్యం వచ్చె క్రమంలో క్రైస్తవ్యం మతమై పోయింది. ( Alexander Schmemann, 20th century Eastern Orthodox Priest, teacher, and Writer ). క్రైస్తవ్యం మతానికి అతీతమయినది, మారడానికి ఇది వేరే మతం కాదు. పారసికుల, యూదుల పాలన సమయాలయిన  రోమన్ కాతోలిక్ సంఘం రుపొందించబడిన 4-6 శతాబ్దాలలో క్రైస్తవ్యం లోనికి మతపరమయిన అలవాట్లు ప్రవేశించాయి. అప్పటి వరకు  క్రైస్తవ్యం ఒక మార్గం, ఒక విశ్వాసం, నిరీక్షణ, ఐక్యత, ప్రేమ గా క్రీస్తే గురిగా ఉండేవారు. కాని ప్రస్తుత రోజుల్లో క్రైస్తవ్యం లోనికి వదిల వచ్చిన పాత మతాల అలవాట్లు కలగలిపి ఆరాధన చేస్తున్నారు. అందుకే ప్రభువు వారు చెపుతున్నారు యెషయ 29:13d వారు నాయెడల చూపు భయబక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. మత్తయి 15: 6 మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. దేనినుండి అయితే ప్రభువు మానవ జాతిని విడిపించారో మరల ఆ పిత్రు పారంపర ఆచారాలు, పద్ధతులు, క్రమాలు, కట్టుదిట్టమయిన కట్టుబాట్లు మరల సంఘం లోనికి మెల్లగా ప్రవేశించి మొత్తాన్ని అక్రమించేసుకున్నాయి. "గలతీ 5:1 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకోనకుడి". ప్రియ సహోదరుడ ఈరోజు నీ క్రైస్తవ్యం ఎటువైపు క్రిస్తు వాలే నడచే క్రీస్తు వారసుడవా? ఆచారాల క్రైస్తవుడవా?

షలోమ్.
మీకోరకు ప్రార్ధించే           
అపోస్తులు నెల్లి  నాని బాబు
( source ) 

Wednesday, December 18, 2019

మనిషిని దేవునికి దూరం చేసే W W W





మానవ జాతిని సాతాను తప్పు త్రోవ పట్టించడానికి, దేవునికి దూరం చేసి, పతనానికి దగ్గర చేయడానికి వాడే మూడు బాణాలు W-W-W. మొదటిది wine, మద్యం. బైబిల్ చెపుతుంది మద్యం వెక్కిరింతల పాలు చేస్తుంది, త్రాగుబోతులు దరిద్రులగుదురు, దృష్టి లోపం కలుగుతుంది,  మద్యానికి అలవాటు పడినవారు గొడవలు కు కారణంగా ఉంటారు,  మద్యం సర్పం వలె కాటు వేస్తుంది, వెఱ్ఱి మాటలు వస్తాయి, అది సారం లేని ఆహారం కాబట్టి ఆరోగ్యం క్షీణిస్తుంది ( సామెతలు 23 అధ్యాయం, యెషయ 55 అధ్యాయం, ). దీనికి అలవాటు పడిన వాడు దేవునికి దూరం అయ్యి సమజం లో విలువను కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి పతన స్థితికి వచ్చేస్తాడు. రెండవది: Wealth, ధనాశ. ఎలాగైనా  ధనవంతులం కావాలనే ఆశ. వాక్యం ధనవంతులకు, అస్తిపరులకు, ధన సంపాదనకు వ్యతిరేకం కాదు. దేవుని ఆశిర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని బైబిల్ చెపుతుంది. కాని దానిని సంపాదించాలనే పేరాశ లంచాలు, దోపిడిలు, దొంగతనాలు, అక్రమాలు చేయడానికి, పిసినారి తనంగా ఉండటానికి  ప్రేరేపిస్తుంది. అది చివరకు సస్పెన్షన్, డిబార్, ఉద్యోగాన్ని కోల్పోవడం, సమాజములో విలువ లేని వానిగా చేస్తుంది. తద్వారా పతన స్థితికి చేరుకుంటారు.  సామెతలు 28:20, 20:21, 11:28, 15:27,28, 16:8, 20:17. లంచము గురుంచి మాట్లాడి దానిని వ్యతిరేకించిన ఒకే ( మత ) గ్రంధము పరిశుద్ధ గ్రంధము. ద్వితి 16:19; ప్రసంగి 7:7; మూడవది : woman., స్త్రీ కాంక్ష, శరిరాస, దేవుని వాక్యం చెపుతుంది. వివాహములో పాపము లేదు, స్త్రీ పురుషుడు కలసి  కుటుంబముగా కట్టబడి, ఫలించబడి ఉండటమే దేవుని నిర్ణయం. కాని అంతకు మించి పొరుగు స్త్రీని గాని పురుషున్ని గాని ఆశించినట్లయితే దాని వలన జీవితం లో పతన స్థితికి చేరవలసి ఉంటుంది అని వాక్యము చెపుతుంది. సామెతలు 23:27; 22:14; 2:16-19;  వీటిలో ఎక్కడైనా నీవు సాతానుకు దొరికి పోవొచ్చు గనుక మెలకువతో ప్రార్ధిస్తూ  ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంభ విలువలను, నీ భవిష్యత్తును, నీ బిడ్డల భవిష్యత్తును కాపాడుకో సోదరా ప్రియ సహోదరి.....
షలోమ్
మీకోరకు ప్రార్ధించే               
అపోస్తులు నెల్లి  నాని బాబు
( source )

Monday, December 16, 2019

సంఘాలలో అలవాట్లు సంప్రదాయములు గా మారడం




శీతల ప్రాంతాలలో హీటర్ లు లేనప్పుడు ఇళ్ళల్లో కట్టేలుపోయ్యలు, మంటలు వేసుకునే వారు. అదేవిధంగా మందిరంలో చలి లేకుండా చెయ్యడం కోసం మందిర గోడకు ఆనుకుని ఉన్న గదిలో మంట వేసేవారు. మంట వెలిగించిన మొదటిలో పెద్దగా వేడి ఉండదు కాబట్టి అందరు మంట వేసిన గోడ పక్కన కూర్చునేవారు. అయితే కొద్ది సేపటికి మంట వేడి పెరిగడం వలన ఆ గోడ పక్కన కూర్చోలేక రెండో పక్కకు మారేవారు. అలాగే ప్రతి వారం జరుగుతుంది. ప్రారంభం నుండి పాటలు అయ్యే సమయం వరకు ఒక పక్కన కుర్చుని వేడి పెరిగాక మరోపక్కకు మారడం చేస్తూ ఉండేవారు. అలాగే చాల కలం గడచింది. చర్చి ఆదాయం లో ఆదిక కర్చు పుల్లలకే అవ్వడం గమనించి, చర్చి హీటర్  ( విద్యుత్తు  ద్వారా వేడిని కలిగించే యంత్రం ) వేయించి, పాస్టర్ గారు ఉన్నత పరిచర్యకు వెళ్ళ వలసి ఉండి మరో పాస్టర్ గారిని అక్కడ నియమించారు. అయన రాగానే సంఘంలో ఒక వింత చేస్టను గమనించి హడలిపోయారు. అందరు పాటలు అయ్యేవరకు ఒకే పక్క కూర్చుని, పాటలు అవ్వగానే సేవకుని అనుమతి లేకుండా అందరు ఒకేసారి లేచి వేరే పక్కకు వచ్చి కూర్చుంటున్నారు. వాళ్లకు అది ఒక అలవాటుగా మారి పోయింది గాని అందులోని ఆంతర్యాన్ని గమనించడం లేదు. హీటర్ వచ్చినా గాని వారు అలవాటును మానుకోలేక పోతున్నారు. అలాగే మన అలవాటులు, ఆలోచనాలను అనుసరించి ప్రభువును స్తుతించుచున్నమేమో ఒకసారి అలోసించండి. దేవుని వాక్యం చెపుతుంది. మత్తయి 15:6 మీరు మీ పారంపర్యాచారాము నిమితమై  దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు." నీకు ముందు ఉన్నవారు వారు నేర్చుకున్న, వాక్యం అర్ధం అయినట్లు ప్రభువును స్తుతించారు. అయితే ఈరోజు నీవు జాగ్రత్తగా ప్రభువు వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని రాజ్య క్రమమును అనుసరించాలి. మీ సేవకునితో దానిని గూర్చి సర్చించి అందులో నీకున్న ఆలోచన సరియినదా కాదా అన్నది నేర్చుకోవాలి.  దేవున్ని ఆరాధించుటకు నీకు నచ్చినట్లు, పూర్వికులు చేసినట్లు  గాకా దేవుని చిత్తప్రకారము ఆరాధిస్తూ దైవ దీవెనలు పొందండి.

షలోమ్

మీకోరకు ప్రార్ధించే               
అపోస్తులు నెల్లి  నాని బాబు

source

Sunday, December 15, 2019

మందిరం లోనికి పురుగులు మరలా రాలేదు?




ఒక సేవకుల సహవాసం లో కొంతమంది సేవకులు వారి మందిరాలు గురుంచి మాట్లాడుకుంటూ, మందిరాలలోనికి పురుగులు రావడం గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధముగా ఎంత ప్రయత్నాలు చేసినా పురుగులు పోవడం లేదని చెప్పుకుంటున్నారు. అయితే అక్కడ ఒక పాస్టర్ గారు మాత్రం అసలు ఏవిధమయిన చింత లేకుండా కుర్చుని ఉండటం చూసి మీకు పురుగులు బెడద లేదా అని అడిగారు. అందుకు పాస్టర్ గారు మీ అందరికంటే ఎక్కువ ఉండేవి, కాని ఇప్పుడు రావడం లేదు అన్నారు అట. అంతే అందరి చూపులు ఈ పాస్టర్ గారి వైపు తిరిగిపోయాయి. ఏమి చేసారు పురుగులు రాకుండా.. పాస్టర్ చాల ప్రశాంతంగా లోపలి వచ్చిన వాటికేల్ల బాప్తిస్మం ఇచ్చేస్తున్నాను. అన్నరంట... ఈరోజుల్లో సంఘం ఇలానే ఉంది.. దేవునిలోనికి వచ్చిన క్రొత్తలో అసలు మందిరం విడువకుండా ప్రార్ధనకు వచ్చేస్తారు... కాని బాప్తిస్మాలు పొందాక అసలు మందిరానికి రావడం మానేస్తుంటారు.... అందుకే వాక్యం చెపుతుంది. కొందరు మానుకోను చున్నట్టుగా సమాజముగా కూడుట మానక ...... ఆ దినము సమీపించుట మీరు చుసిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు.... హెబ్రీ 10:25, వీరు అపోస్తులుల బోధ యందును సహవాస మందును, రొట్టె విరచుట యందును ప్రార్ధన చేయుట యందును ఏడ తెగక యుండిరి. అపోస్తులు 2: 42. మనం ప్రభువు కోరుకునిన సంఘముగా విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఉందాం...

షలోమ్
మీకొరకుప్రార్ధించే
అపోస్తులునెల్లినానిబాబు
source