Showing posts with label Friendship. Show all posts
Showing posts with label Friendship. Show all posts

Thursday, December 12, 2019

నిజ స్నేహితుణ్ణి గుర్తించడం ఎలా?



అసలు నీకు నిజమయిన స్నేహితుడు ఎవరు? నీకు ఎదురు పడే వారందరు నీకు స్నేహితులేనా? నీతో సమయాన్ని గడిపే వారందరు స్నేహితులేనా? నీవు ఎంతమందికి నిజమయిన స్నేహితుడవు? అసలు నిజమయిన స్నేహితుడు ఏమి చేస్తాడు?  జీవితం లో కొన్ని పర్యాయాలు తొందరపాటు నిర్ణయాలు వలన, అపార్ధాల వలన నిజమయిన స్నేహితులను కోల్పోతుంటాము. నిజమయిన, మనకోసం దేవుడు నిర్ణయించిన  మన హృదయానికి దగ్గర అయిన స్నేహితుడను కనుగొనడం ఎలా? దానికి పరిశుద్ధ గ్రంధం లో ఒక మాట ఈరోజు కొరకు గుర్తు చేసి ముగిస్తాను. నిజ స్నేహితుడను గుర్తించడానికి ఒక కొలమానం సామెతలు 27:6 లో ఇలా ఉంది. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. అలా అని ముద్దులు పెట్టేవారందరు పగవారు కాదు, గాయాలు చేసేవారందరు స్నేహితులు కారు. దీనిని అర్ధం చేసుకోడానికి మరో మాట పరిశుద్ధాత్ముడు సోలోమోను ద్వారా చెప్పారు. సామెతలు 20:30 గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చేడుతనమును తొలగించును. సామెతలు 6:23 శిక్షార్ధమయిన గద్దింపులు జీవమార్గములు.  చేడుతనమును ప్రోత్సయించే వాడు కచ్చితంగా నీకు విరోధి. సామెతలు 16:29 బలత్కారి తన పొరుగు వానిని లాలన చేయును, కాని మార్గములో వాని నడిపించును.  ఒకవేళ ఆ వయస్సులో ఇది తప్పు కాదు అని చెప్పి, మామూలే అని నిన్ను ప్రోత్సయించినప్పుడు అప్పటికి అది నీకు మంచి అయివుండవొచ్చు కాని దాని వలన బవిషత్ లో సమస్యలకు గురి కావలసి ఉంటుంది. ఉదాహరణ మందు ను ప్రోత్సయించే వాడు నీకు విరోదియా స్నేహితుడా? అల్లరిని ప్రోత్సయించేవాడు నీకు స్నేహితుడా, విరోదా? చదువు కోవలసిన సమయాన్ని సినిమాలకు, షికారులకు నిన్ను ప్రోత్సయించే వాడు నీకు స్నేహితుడా విరోదా? భవిష్యత్ లో నష్టాన్ని, కష్టాన్ని, అగౌరవాన్ని తెచ్చే వాటికై ప్రోత్సహించే వాడు నీకు శత్రువు, భవిష్యత్ లో నీకు మేలు, లాభం, విలువ తెచ్చే విషయాలలో ప్రోత్సయించే వాడు నిమయిన స్నేహితుడు., సమాజంలో ఎలా బ్రతికితే విలువ ఉంటుందో చెప్పేవాడు ఒకడు ఉంటాడు. నీవు తప్పు పై తప్పు లు చేస్తున్నా నిన్ను వెన్నంటి ఉండి నిన్ను ఒక మంచి స్థితిలో చూడాలని అసపడుతూ నీకోసం పరితపించే  వాడే నీకు నిజమయిన స్నేహితుడు వానిని వదలకు జీవితం లో చాలా కోల్పోతావు...... అయితే నీవు నీ స్నేహితునికి ఎలాంటి స్నేహితుడవు ?  నీవు మంచి స్నేహితునిగా ఉండి మంచి స్నేహితుని కలిగి ఉందువు గాక!
 షలోమ్
మీకోరకు ప్రార్ధించే               
అపోస్తులు నెల్లి  నాని బాబు
source

3 రకాల స్నేహితులు



మనకు చాల మంది స్నేహితులు ఉంటారు. వారిలో 3 రకాలైన స్నేహితులు ఉంటారు.  నీ శత్రువుకు శత్రువు నీకు స్నేహితుడు, తన నెరవేర్పు అయ్యాక నీతో స్నేహం చెయ్యడు. మీ శత్రువు మీద పాగా తీసుకోవడం వరకు మాత్రమే నీతో ఉంటాడు కానీ వారు నీకోసం కాదు నీ వు తలపెట్టిన కార్యం, ఉద్యోగం, పని,  కొరకు  నీతో స్నేహం చేసే వారు. వారు ఆ కార్యం వరకు మాత్రమే నీతో ఉంటారు. కానీ దానికి మించి ఆవల నీకు ఉపయోగ పడరు, నీతో ఏకీభవించరు. నీతో కలసి పని చేస్తారు, కలసి ఉంటారు, కలసి సమయాన్ని గడుపుతారు, కానీ వారు నీకోసం కాదు. నీవు చేసే పని, ఉద్యోగం కోసం మాత్రమే. ఒకవేళ వేరే వారి స్నేహం దొరికితే నిన్ను మరచి పోగలరు, వదిలి పెట్టగలరు. మూడవ రకం, కానీ నిన్ను నిన్నుగా ప్రేమించి, నీ కష్టాలలో నీతో ఉంటు, నీ సంతోషం లో పాలు పంచుకుంటూ, నిన్ను గద్దిస్తూ, నిన్ను సరి చేస్తూ, ప్రోత్సహిస్తూ ఉండే వాడు ఒకడు ఉంటాడు వాడే నీకు నిజమైన స్నేహితుడు. ఇలాంటి స్నేహితుడు నీ గమ్యం చేరడానికి కావాలి. ఇలాంటి వారు ఉంటేనే దేవుడు నిన్ను పిలుచుకున్న కార్యం చెయ్యగలవు. అందుకోసమే వారిని సిద్ధపరుస్తాడు.  యోనాతాను వంటి వాడు లేకుండా నీవు దావీదు గా ఉండలేవు.  అయితే ఆ స్నేహాలు తప్పనిసరిగా మన మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. వారు మనలను వదిలిన గాని వారు నేర్పిన కొన్ని అలవాట్లు ఇంకా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే నీ స్నేహం ఎవరితోనో ఆలోసించుకో, వారి నుండి ఏమి నేర్చుకుంటున్నావో  గ్రహించు కో... అందుకే దేవుని వాక్యం లో ఒక మాట ఉంది 1 కొరింది 15:33 1Cor మోసపోకుడి,  దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరువును. అందరితోను స్నేహంగా ఉండు కానీ నీ నడవడి, నీ జీవితం, నీ గమ్యం, నీ ఆత్మీయత, నీ కుటుంభం ఆలోసించు. అందుకే దావీదు అంటాడు. కీర్తనలు 119: 63 Ps నీ యందు భయ భక్తులు గలవారందరికిని  నీ ఉపదేశములను అనుసరించు వారికిని నేను చెలికాడను. మోస పోవొద్దు సహోదరుడా, సహోదరి.. ప్రభువు నీకు బలపరచే స్నేహితులను, ఆత్మీయంగా దేవునికి దగ్గర చేసే స్నేహితులను దయ చేయును గాక !  

షలోమ్

మీకొరకు ప్రార్ధించు 

అపోస్తులు నాని బాబు నెల్లి,
source