Showing posts with label జక్కయ. Show all posts
Showing posts with label జక్కయ. Show all posts

Thursday, December 12, 2019

జక్కయ లోని మార్పు




ఈరోజు ఒక సవాలు మీకు... అసలు క్రీస్తుకు హృదయం లో స్థానం ఇచ్చారా... క్రీస్తుకు హృదయం లో స్థానం ఇస్తే క్రైస్తవుని జీవితం లో జరిగే కొన్ని మార్పులలో రెండు మీకు గుర్తు చేస్తాను. లూకా 19 వ అధ్యాయం లో ఒక పన్నులు వసూలు చేసే అధికారి, బాగా ధనవంతుడు యేసును చూడాలని తన ధన గర్వం, అధికార మదం పక్కన పెట్టి ఒక సామాన్య మానవునిగా చెట్టు ఎక్కాడు. నీవు దేవుని కొరకు ఎంత తగ్గించు కుంటున్నావు. దేవుని దగ్గరకు రావడానికి నీకు అడ్డు వస్తున్న గర్వం, అధికారం, ధనం మొదలైన వాటిని వదిలి రాగలవ... జక్కయ లా దీన మనస్సు ధరించు కోగలవా.. రెండు యేసు ఇంటికి వచ్చే సమయంలో యేసు వారు ఏమి చెప్పకుండానే.... తన ఆస్తిని  ఏవిధమైన తారతమ్యాలు లేకుండా బీదలకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, తీసుకున్న అన్యాయపు సొమ్మును తిరిగి 4 వంతులు కలిపి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. అన్యాయముగా సంపాదించు ధనమును అసహించు కున్నాడు. మరి నీవు యాకోబు 1:27 లో చెప్పినట్టు నిష్కలంక మయిన బక్తి చెయ్యగలుగు తున్నవా .. అన్యాయపు సొమ్మును వదులుకోగలుగుతున్నవా ?... యేసు వారు ఇంటికి రాకుండానే జక్కయ్య లో మార్పు వచ్చింది... నీవు ఎన్ని రోజుల నుండి క్రైస్తవుడవు? ఇప్పటికైనా నిజ బక్తిని కలిగి ఈలోకసంబంధమయిన వాటిని త్యజించి యేసువారి నిజ శిష్యునిగా జీవించు....
షలోమ్
మీ కొరకు ప్రార్ధించే.,
అపోస్తులు నాని బాబు నెల్లి.
source