Showing posts with label మనస్సు. Show all posts
Showing posts with label మనస్సు. Show all posts

Wednesday, December 18, 2019

మనిషిని దేవునికి దూరం చేసే W W W





మానవ జాతిని సాతాను తప్పు త్రోవ పట్టించడానికి, దేవునికి దూరం చేసి, పతనానికి దగ్గర చేయడానికి వాడే మూడు బాణాలు W-W-W. మొదటిది wine, మద్యం. బైబిల్ చెపుతుంది మద్యం వెక్కిరింతల పాలు చేస్తుంది, త్రాగుబోతులు దరిద్రులగుదురు, దృష్టి లోపం కలుగుతుంది,  మద్యానికి అలవాటు పడినవారు గొడవలు కు కారణంగా ఉంటారు,  మద్యం సర్పం వలె కాటు వేస్తుంది, వెఱ్ఱి మాటలు వస్తాయి, అది సారం లేని ఆహారం కాబట్టి ఆరోగ్యం క్షీణిస్తుంది ( సామెతలు 23 అధ్యాయం, యెషయ 55 అధ్యాయం, ). దీనికి అలవాటు పడిన వాడు దేవునికి దూరం అయ్యి సమజం లో విలువను కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి పతన స్థితికి వచ్చేస్తాడు. రెండవది: Wealth, ధనాశ. ఎలాగైనా  ధనవంతులం కావాలనే ఆశ. వాక్యం ధనవంతులకు, అస్తిపరులకు, ధన సంపాదనకు వ్యతిరేకం కాదు. దేవుని ఆశిర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని బైబిల్ చెపుతుంది. కాని దానిని సంపాదించాలనే పేరాశ లంచాలు, దోపిడిలు, దొంగతనాలు, అక్రమాలు చేయడానికి, పిసినారి తనంగా ఉండటానికి  ప్రేరేపిస్తుంది. అది చివరకు సస్పెన్షన్, డిబార్, ఉద్యోగాన్ని కోల్పోవడం, సమాజములో విలువ లేని వానిగా చేస్తుంది. తద్వారా పతన స్థితికి చేరుకుంటారు.  సామెతలు 28:20, 20:21, 11:28, 15:27,28, 16:8, 20:17. లంచము గురుంచి మాట్లాడి దానిని వ్యతిరేకించిన ఒకే ( మత ) గ్రంధము పరిశుద్ధ గ్రంధము. ద్వితి 16:19; ప్రసంగి 7:7; మూడవది : woman., స్త్రీ కాంక్ష, శరిరాస, దేవుని వాక్యం చెపుతుంది. వివాహములో పాపము లేదు, స్త్రీ పురుషుడు కలసి  కుటుంబముగా కట్టబడి, ఫలించబడి ఉండటమే దేవుని నిర్ణయం. కాని అంతకు మించి పొరుగు స్త్రీని గాని పురుషున్ని గాని ఆశించినట్లయితే దాని వలన జీవితం లో పతన స్థితికి చేరవలసి ఉంటుంది అని వాక్యము చెపుతుంది. సామెతలు 23:27; 22:14; 2:16-19;  వీటిలో ఎక్కడైనా నీవు సాతానుకు దొరికి పోవొచ్చు గనుక మెలకువతో ప్రార్ధిస్తూ  ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంభ విలువలను, నీ భవిష్యత్తును, నీ బిడ్డల భవిష్యత్తును కాపాడుకో సోదరా ప్రియ సహోదరి.....
షలోమ్
మీకోరకు ప్రార్ధించే               
అపోస్తులు నెల్లి  నాని బాబు
( source )

Sunday, December 8, 2019

దేవునికి ఎప్పుడు ఇవ్వగలం?




దేవునికి అర్పనలు ఇవ్వడానికి చాలా సార్లు మనం వెనకాడుతు ఉంటం. చిన్న మొత్తం లో ఇవ్వడం అంటే చాలా ఉధారం గా ఇవ్వగలం. కానీ  పెద్ద మొత్తం లో ఇవ్వవలసి వస్తే మాత్రం మానవ మనస్సు కొంచెం
వెనకడుగు వేస్తం. ఇచ్చేది మనుషులకి ఇస్తున్నట్టు మనం వెళ్లే మందిరములో సేవకుని చూసి, అతని స్థితి గతులను చూసి, ఇంకా పెద్ద సేవకుని ఇద్దాం అని సంబంధం లేని ఇతర సేవకులకు ఇస్తు ఉంటుంటారు. అది ఏ మాత్రం సరియాయిన, వాక్యనుసారమైన పద్ధతి కాదు. మనం వెళ్లి వాక్యాహరం తినే సంఘములో మాత్రమే ఇవ్వడం మంచి అలవాటు.   దేవునికి ఇచ్చేటప్పుడు సందేహింప కుండా, విసుకొక్కుండ, పిసినితనం గా కాక ఇవ్వవలెను అని వాక్యం చెపుతుంది. ( 2 కోరింది 9:5 ). అయితే ఆ మనసు ఎలా కలుగుతుంది? మొదట గా గమనించ వలసిన విషయం,  మనం ఆదాయం సంపాదిండానికి  తగిన సామర్ధ్యత కలుగచేసింది ఆయనే! ఇది మనస్సు లో ముద్రించు కోవాలి ( ద్వితి 8:18 ). రెండవది నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా దేవుడు ఇచ్చింది అని నమ్మాలి. మూడవది ఆయన ఇచ్చిన దానిలో కొంత ఆయనకు ఇస్తున్నాను అని భావించ గలగాలి. ( 1 దిన 29:14 ). నాల్గవది, నేను పోగొట్టుకునేది ఏమీ లేదు, మరలా సంపదించోకడనికి సామర్ధ్యము ను అనుగ్రహించు వానికే ఇస్తున్నాను అని మనసును సాధన చేయగలగాలి. ఉదాహరణ కు అబ్రాహాము 100 సంవత్సారాలు కి దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు, ఇచ్చిన 20 సంవత్సారాలు కి అదే కొడుకును బలి ఇమ్మన్నారు. అబ్రాహాము సంతోషంతో ఇవ్వడానికి అన్ని సిద్ధం చేశాడు. కారణం 100 సం|| రాల వయస్సు లో ఇవ్వగలిగిన దేవుడు ఈ వయస్సులో ఇవ్వలేరా? నా శక్తి వలన నేను పొందుకున్నను అని అనుకుని ఉంటే కచ్చితంగా దేవుని మాటకు అవిదేయుడు అయ్యేవాడు. మరి నీ జీవితం లో దేవునికి ఇవ్వడం లో అవిధేయత ఉందేమో! దశమ బాగాలు, కృతజ్ఞతా అర్పణలు, మ్రొక్కుబడులు, దేవుడు ఇవ్వవల్సినవి ఏవి ఆలస్యం చేయకు. అబ్రహాము కుమారుణ్ణి బలి  ఇవ్వడానికి సిద్ధ పడిన తరువాత దాచబడిన పొట్టేలు కనిపించింది. నీ కొరకు దాచ బడిన ఆశీర్వాదం నీవు విశ్వాసంతో చేసే క్రియల మీద ఆధార పడి ఉంటుంది. మరిన్ని విషయాలు తరువాత ఆర్టికల్ లో చదువుదాం.... 

దేవుని కి ఇచ్చి దేవుడు దాచి పెట్టిన ఆశీర్వాదం మీరు పొందుదురు గాక,

క్రీస్తు దాసుడు,

ఆపోస్తులు నాని బాబు నెల్లి
990 882 3196