Friday, December 13, 2019

దేవునికి మీ ఇంట్లో కుర్చీ వేసావా?




​ప్రియ సహోదరి సహోదరుడ, మన ఇంటికి వచ్చే ప్రతి అతిధి కి ఆతిద్యం ఇవ్వడం చాల ఇష్టమయిన పని. అది ఆశీర్వాద కరము కూడా. అయితే సర్వసృష్టి కర్తకు ఆతిద్యం ఇవ్వడం అంటే మనకు ఇంకెంత ఆశీర్వాదం. మరి అయన మనతోనే ఉండాలి అని అసపడుతున్నారు. కాని మనం ఆయనకు సరిఅయిన రీతిలో ఆతిద్యం ఇవ్వడం మానేసి,. కానిసం  ఆయనకు కూర్చోడానికి ఒక కుర్చీ కూడా వెయ్యకుండా మన కోరికలన్నీ అయన ముందర పెట్టేస్తాం. కాని అసలైన విషయం ఏమిటి అంటే  పరిశుద్ధ గ్రంధం లో ఒక మాట ఉంది. మన అవసారాలన్ని మనం అడగక ముందే ఆయనకు తెలుసు. ప్రార్ధన అంటే మాట్లాడటం, అయన పాదాల వద్ద కూర్చోవడం. అంటే ముందు ఆయనకు ఒక కుర్చీ వెయ్యలిగా? మరి ఆయనకు కుర్చీ వేసారా? వెంటనే మన ఇంట్లో ఒక పక్కన ఒక కుర్చీ వెయ్యడం కాదు. బైబిల్ లో ఆయనకు కుర్చీ అంటే ఏంటో చెప్పారు. కీర్తన 22:3 లో “నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసినుడవై యున్నావు” అని వ్రాసి ఉంది. అంటే దేవునికి నీవు వెయ్యాల్సింది చెక్క కుర్చీ, స్టీల్ కుర్చీ, మడత కుర్చీ, స్పంజి కుర్చీ కాదు. ఆయనకు వెయ్యాల్సింది స్తుతి అనే కుర్చీ. అది వెయ్యగలిగితే అయన నీవు ఉన్న ప్రతి చోట అది ఆఫీస్, ఇల్లు, రోడ్, పని చేసే చోట, ఏదైనా సరే  నీ ప్రక్కనే అయన కుర్చుని ఉంటారు. అయన నీ ప్రక్కనే ఉంటారు... స్తుతి చెయ్యడం మొదలు పెడతావా? నీ నోటిలో స్తుతి ఉంటె నీ పరిస్థుతులలో యేసువారు ఉంటారు. సర్వశక్తి కలిగిన దేవుడే నీ ప్రక్కనే ఉన్నారు దేనికి భయం ఇకా? ప్రభువు నీవు చేసే స్తుతుల మీద అసీనుడు అయ్యి నీ పక్షాన ఉండును గాక?
షలోం.
మీ కొరకు ప్రార్ధించే
అపొస్తులు నాని బాబు నెల్లి
source

No comments:

Post a Comment