Thursday, December 12, 2019

స్వస్థత


అనారోగ్యం కలిగినప్పుడు, హాస్పిటల్ లో ఉండవలసి వచ్చినప్పుడు, తగ్గని భలహినతలు విసికిస్తున్నపుడు, విశ్వాసి దేవుని మీద అనుకుంటాడు. అయితే కొన్ని పర్యాయాలు ఆ  విశ్వాసాన్ని కూడా బలహీన పరచే శారీరక సమస్యలు వెంటాడుతూ ఉండొచ్చు. దేవుడే ఉంటె నాకు ఎందుకు ఇ రోగాలు, దేవుడే ఉంటె నన్ను ఎందుకు స్వస్తపరచడం లేదు. దేవుని బిడ్డ కదా? అసలు ప్రార్ధనా మానదు కదా? దేవుని పని ముందుంటాడు కదా? ప్రార్ధనా పరుడే కదా? ఇలా బయట వారు మాట్లాడుతుంటే మన విశ్వాసం ఇంకా భలహిన పడుతుంది. కొంతమంది దేవుని ఎరిగిన వారే స్వస్తలు లేవు అంటారు, ఉంటె హాస్పిటల్ లో రోగులు ఎందుకున్నారు అని వాదనలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులలో నీవు ఉంటె ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. మన దేవుడు సర్వవ్యాప్తి, సర్వజ్ఞాని, పరమ వైద్యుడు. మందిరాలలో స్వస్తపరచేది ఆయనే, స్వస్తతాసాలల్లో బాగుచేసేది ఆయనే, హాస్పిటల్ లో బాగుచేసేది ఆయనే. అయన అన్నారు నిర్గమ 15:26 “నిన్ను స్వస్థ పరచు యెహోవాను నేనే”. అసలు నిన్ను బ్రతికించేది ఆయనే, స్వస్థ పరచేది ఆయనే. ఎక్కడైనా ఎలా అయిన., కొంత మంది కి దురాత్మల వలన వ్వాదులు రావొచ్చు, దురత్మలను పార ద్రోల గలిగిన వాడు ఆయనే, కొంతమందికి వారి పాపముల వలన వ్వాదులు రావొచ్చు, పాప పరిహారం చెయ్యగలవాడు ఆయనె, కొన్ని రోగాలు ఆహార లోపం వలన వస్తున్నాయి, నీకు ఆరోగ్య కరమైన ఆహారాన్ని తినమని ప్రభువు ఆకుకూరలు, కూరగాయలు సిద్ధపరచింది ఆయనే, కొంత మందికి వైద్యము అవసరం అవ్వవచ్చు ఇక్కడ గమనించండి వైద్యమందు నీకు అవసరమని ముందుగానే తన బిడ్డలను ప్రేరేపించి సిధం చేయించారు మన ప్రభువు. అక్కడా ఆయనే నిన్ను స్వస్థ పరచే వాడు. నిన్ను వదిలి పెట్టె వాడు కాదు ఆయన . “కీర్తన 107: 20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను”. యెహోవా రాఫా నామము కలిగిన దేవుడు నిన్ను స్వస్తపరచి లేవనేత్తును గాక? నీ రహస్వ రోగములను పారద్రోలును గాక?

షలోమ్
మీ కొరకు ప్రార్ధించే,
అపొస్తులు నాని బాబు నెల్లి,
source

1 comment: