దేవునికి అర్పనలు ఇవ్వడానికి చాలా సార్లు మనం వెనకాడుతు ఉంటం. చిన్న మొత్తం లో ఇవ్వడం అంటే చాలా ఉధారం గా ఇవ్వగలం. కానీ పెద్ద మొత్తం లో ఇవ్వవలసి వస్తే మాత్రం మానవ మనస్సు కొంచెం
వెనకడుగు వేస్తం. ఇచ్చేది మనుషులకి ఇస్తున్నట్టు మనం వెళ్లే మందిరములో సేవకుని చూసి, అతని స్థితి గతులను చూసి, ఇంకా పెద్ద సేవకుని ఇద్దాం అని సంబంధం లేని ఇతర సేవకులకు ఇస్తు ఉంటుంటారు. అది ఏ మాత్రం సరియాయిన, వాక్యనుసారమైన పద్ధతి కాదు. మనం వెళ్లి వాక్యాహరం తినే సంఘములో మాత్రమే ఇవ్వడం మంచి అలవాటు. దేవునికి ఇచ్చేటప్పుడు సందేహింప కుండా, విసుకొక్కుండ, పిసినితనం గా కాక ఇవ్వవలెను అని వాక్యం చెపుతుంది. ( 2 కోరింది 9:5 ). అయితే ఆ మనసు ఎలా కలుగుతుంది? మొదట గా గమనించ వలసిన విషయం, మనం ఆదాయం సంపాదిండానికి తగిన సామర్ధ్యత కలుగచేసింది ఆయనే! ఇది మనస్సు లో ముద్రించు కోవాలి ( ద్వితి 8:18 ). రెండవది నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా దేవుడు ఇచ్చింది అని నమ్మాలి. మూడవది ఆయన ఇచ్చిన దానిలో కొంత ఆయనకు ఇస్తున్నాను అని భావించ గలగాలి. ( 1 దిన 29:14 ). నాల్గవది, నేను పోగొట్టుకునేది ఏమీ లేదు, మరలా సంపదించోకడనికి సామర్ధ్యము ను అనుగ్రహించు వానికే ఇస్తున్నాను అని మనసును సాధన చేయగలగాలి. ఉదాహరణ కు అబ్రాహాము 100 సంవత్సారాలు కి దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు, ఇచ్చిన 20 సంవత్సారాలు కి అదే కొడుకును బలి ఇమ్మన్నారు. అబ్రాహాము సంతోషంతో ఇవ్వడానికి అన్ని సిద్ధం చేశాడు. కారణం 100 సం|| రాల వయస్సు లో ఇవ్వగలిగిన దేవుడు ఈ వయస్సులో ఇవ్వలేరా? నా శక్తి వలన నేను పొందుకున్నను అని అనుకుని ఉంటే కచ్చితంగా దేవుని మాటకు అవిదేయుడు అయ్యేవాడు. మరి నీ జీవితం లో దేవునికి ఇవ్వడం లో అవిధేయత ఉందేమో! దశమ బాగాలు, కృతజ్ఞతా అర్పణలు, మ్రొక్కుబడులు, దేవుడు ఇవ్వవల్సినవి ఏవి ఆలస్యం చేయకు. అబ్రహాము కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధ పడిన తరువాత దాచబడిన పొట్టేలు కనిపించింది. నీ కొరకు దాచ బడిన ఆశీర్వాదం నీవు విశ్వాసంతో చేసే క్రియల మీద ఆధార పడి ఉంటుంది. మరిన్ని విషయాలు తరువాత ఆర్టికల్ లో చదువుదాం....
దేవుని కి ఇచ్చి దేవుడు దాచి పెట్టిన ఆశీర్వాదం మీరు పొందుదురు గాక,
క్రీస్తు దాసుడు,
ఆపోస్తులు నాని బాబు నెల్లి
990 882 3196
No comments:
Post a Comment