ఈరోజు పునరుధాన దినం
ఆరాధనా రోజు, కుటుంబముగా కలసి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారని
అసిస్తున్నాను. యొహోషువ అన్నట్టు నేనును నా ఇంటివారును యెహోవాను సేవించేధము,
అనుకుంటూ వెళ్తున్నారని ప్రార్ధిస్తున్నాను. అయితే
ప్రార్ధనకు ఏప్పుడు వెళ్తున్నారు అనేది ఒక ప్రాముఖ్యమయింది. చాల మంది
పనులు చక్కపెట్టుకుని, చుట్టాలను చక్కపెట్టి, వారమంతా
మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేసుకుని పాటలు అయిపోయకో, స్తుతి
ఆరాధన అయిపోయకో, ప్రసంగం సగం అయిపోయకో వెళ్ళడం అలవాటుగా
మారిపోయింది కొంతమందికి. కాని వాక్యాన్ని బట్టి చూస్తే మందిరానికి ఆసక్తితో
వెళ్ళాలి అని అర్ధం అవుతుంది. ఆసక్తి అంటే ఉదాహరణకు మనకు ఇష్టమయిన టీవీ ప్రోగ్రాం
చూడటానికి సిద్ధపడినట్టు, ఉద్యోగానికి వెళ్లినట్టు, అలాగే ఇంటికి చుట్టం వస్తే ఎదురు చూస్తున్నట్టు, అపాయింట్మెంట్
తీసుకుని డాక్టర్ కలవాడానికి వెళ్లినట్టు. వీటన్నిటికి
ఇచ్చినంత కంటే ఎక్కువ ప్రాధాన్యత మందిరానికి ఇవ్వలేకపోతున్నాము. కారణం మందిరం అంటే
చులకన భావం. వాక్యం చెపుతుంది ఆరాధన జరిగే స్థలములో దేవుడు నిలిచి ఉంటాడు. మరి అయన
పైవారందరి కంటే గొప్పవాడు కాదా? మరి అలాంటప్పుడు ఇంకెంత శ్రద్ధతో
మందిరానికి వెళ్ళాలి. అందుకే వాక్యం లో రెండు వచనాలు చూద్దాం. ఒకటి లూకా 21:38 ప్రజలందరు
ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. అలాగే మనకు
మాదిరి వదిలిన యేసువారు ఏమిచేసారో కుడా చూద్దాం... యోహాను 12: 1 కాబట్టి
యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు ఆరు దినములు
ముందుగా వచ్చెను. యేసు వారు మందిరం లో జరిగే పండుగకు ముదుగా
వెళ్లారు,
ప్రజలు ఆయన వాక్యం వినడానికి ముందుగా, పెందలకడనే
వచ్చారు. మరి నీవు ఎలా వెళ్తున్నావు? అది క్రమమేనా? అది నీకు దీవెన తెచ్చిపెడుతుందా? ఎశావు తండ్రికి
ఆహారం తేవడం ఆలస్యం అయ్యింది, నాది నాకు ఉంటుందిలే
అనుకున్నాడు, ఇంతలో ఆసిర్వదాలన్ని తమ్ముడు పట్టుకుని
వెళ్ళిపోయాడు, ఇక మిగిలింది. పైన చెప్పిన
వాటన్నిటికీ కుదురుతున్న సమయం దినికేందుకు కుదరదు? కుదురుతుంది. అలా
సిద్ధపడి పెందలకడనే, ప్రారంబ ప్రార్ధనకు ముందుగానే వెళ్లి దైవ
దీవెనలు పొందగలరని ఆసిస్తూ.....
షలోమ్
మీకోరకు ప్రార్ధించే
అపోస్తులు నెల్లి నాని బాబు
No comments:
Post a Comment