The Word Today నయాగర వంతెన ఎలా కట్టారో
తెలుశ...
నయాగరా జార్జ్ నది మీద వంతెన కట్టడానికి
ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఒక ఆలోచన మొత్తం పరిస్థితినే మార్చేసింది.
800 అడుగులు వెడల్పైన నది మీద వంతెనకు ఇంజనీర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక
ప్రక్కనుండి మరోప్రక్కకు తాడును వేయలేక పోయారు. వంతెన పనిలో సూపర్వైసర్ గా ఉన్న థియోడార్
జి. హులేట్ కి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే గాలిపటం పోటీలు ఏర్పటు చేసారు. నయాగరా
జార్జ్ ఇవాలి ఒడ్డునుండి ఆవలి వాడుకు ఎవరైతే గాలిపటాన్ని ఎగరివేస్తారో వారికి
ప్రోత్సాహకంగా 5 అమెరికా డాలర్లు
ప్రోత్సాహకం ప్రకటించారు. రెండో
రోజు 16 సంవత్సారాల యోవనస్తుడు హోమాన్ వాల్ష్ విజయవంతంగా దారం తెగిపోకుండా
ప్రయోగించ గలిగాడు. ఆ దారం ను ఆధారం చేసుకుని ఇంజనీర్లు బలపరచి ఇప్పుడు అక్కడ బలమైన వంతెన, రైళ్ళు సహితం
వెళ్ళగలిగిన బలమైన వంతెన కట్టగాలిగారు. గాలిపటం యొక్క దారం చిన్నదే కావచ్చు,
దానిని గొప్ప పనిని పూర్తి చేయడానికి పాత్రగా వాడుకోవచ్చు. దావీదు దగ్గర ఒక చిన్న
గులకరాయి మాత్రమే ఉంది, 5000 మందికి ఆహారం ఒక చిన్న పాత్రలోనుండే వచ్చింది, సంసోను
శత్రువులను చంపడానికి వాడిన దవడ ఎముక
చిన్నదే, ఎలిషా శిష్యుని బార్య వాడిన నునే కుడా చిన్నదే, సారేపతు వెధవరాలు వాదిన
పిండే కొంచెమే.. ప్రభువు చెప్పిన విశ్వాసానికి సాధ్రుస్యం కుడా చిన్న అవ్వగింజే
కదా... మరెందుకు ఆలస్యం నీ ప్రయత్నాన్ని తిరిగి ప్రారంబించు. చిన్నది అని, కొంచెమే
అని, తక్కువ అని ఆగిపోకు బలమైన కార్యాలు చెయ్యగలవు. మీకు ఆవగింజంత
విస్వాసముండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి పోమ్మనగానే అది పోవును. మీకు
అసాధ్యమయినది ఏదియు నుండదనినిశ్శయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మత్తయి
17: 20, 21.
మీకోరకు ప్రార్ధించే,
అపోస్తులు నాని బాబు నెల్లి,
No comments:
Post a Comment