Tuesday, February 5, 2019

దేవుని స్వరం వినుట ఎలా?


The Word Today  


దేవుని స్వరం వినుట ఎలా?

ఒక ఆదివారం మూడవ ఆరాధనకు వెళ్లి కూర్చున్నాను. ఇంతలో సంఘ యవ్వన పిల్లలు వచ్చి పరిచర్య చేస్తున్నారు. ముందు రెండు ఆరాధనలలో ఆరధన నడిపించి, వాక్యం చెప్పి ఆరోజు ఎందుకో కొంచెం బలహినమనిపించి మనసులో పిల్లలు ఎవరైనా వెళ్లి కొంచెం మంచినీళ్ళు తెస్తే బాగున్ను అని అనుకుంటున్నాను. కాని వాళ్లకు చెప్పడానికి పనిలో ఉన్నారు కదా .. అనుకుంటున్నాను. ఇంతలో ఉన్న ముగ్గురు పిల్లలలో ఒక చెల్లి వచ్చి వేడినీళ్ళ? చల్లటి నీళ్ళా? అన్నయ అంది. పక్కన ఉన్న చెల్లిల్లు ఏంటి అని అడిగితే అన్నయ నీరసంగా ఉంది నీళ్ళు ఇమ్మన్నారు కదా, మీకు వినపడలేదా  అంది. నేను కొంచెం సేపు ఆలోచనలో పడి దాని గురుంచి మాట్లాడలేదు. మనం దేవుని స్వరాన్ని ఎలా వినగలుగుతాం? అని అలోసిస్తుంటే  ఈరోజు ఆ సందర్బాన్ని ప్రభువు గుర్తు చేసారు. ఆ చెల్లి మాత్రమే వినగిలింది నా మనసులోని మాట, మిగతా వారు వినలేక పోయారు. కారణం ఈసమయంలో సేవకుని అవసరం ఏమైయుంటుంది, ఈ సమయంలో అయన ఆరోగ్యం ఎలాఉంది, అని తను నా గురుంచి అలోసిస్తుంది. ఈరోజు అన్నయ ఎప్పటిలా చురుకుగా లేడు అని నా గురుంచి అలోసోసించడం వలన నా మనసులోని మాట తను మాత్రమే వినగిలింది. దేవుని మాటను మనం వినగలగాలి అంటే అయన పై మన ధ్యాస పెట్టాలి, మనం ఉన్న స్థితిలో దేవుని ఉద్దేశ్యం ఏంటి అని ఒక్క నిముషం అలోసిస్తే తప్పనిసరిగా దేవుని మాట వినగాలవు. అందుకు ముందు నీవు దేవుని మాటలను హృదయమందు దాచుకోవాలి. కీర్తనలు 119:11  నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.

మీ కొరకు ప్రార్ధించే

అపోస్తులు నాని బాబు నెల్లి.
9908823196
http://jcphindia.weebly.com/thewordtoday
source

No comments:

Post a Comment