ఒక రోజు నేను చెప్పులు
కొనడానికి షాపుకు వెళ్ళాను. అక్కడ కొంచెం పెద్ద వయసు వారు ఉన్నారు. వాళ్ళు నాకు
డాక్టర్ సుసించిన చెప్పులు కావలి అన్నారు. షాపు అతను తెచ్చి ఇచ్చాడు. నాకు అర్ధం
కాలేదు. డాక్టర్స్ చెప్పులు కూడా చీటి వ్రాస్తారా ? అని. తర్వాత నేను దాని
గురుంచి అలోసిస్తే తెలిసింది. మనం సరియయిన చెప్పులు వాడకపోతే, కాళ్ళకు అనుకులమయిన చెప్పులు వాడక పోతే దాని ప్రభావం మోకాళ్ళ మీద పడుతుంది
అని అంతర్జాలం లో తెలుసుకున్నాను. చిన్న వయసు నుండి సరియయిన చెప్పులు వాడక పోతే 40+
వచ్చేసరికి మోకాళ్ళ లో సమస్యలు తలెత్తుతాయట. దాని వాలన పైకి మెట్లు
ఎక్కలేము, నిబడలేము, నడవలేము, మోకాళ్ళు వేయలేము అట. నీవు ఉన్నత స్థితికి ఎదగాలి అన్నా, ఆగిపోక
నీ జీవిత యాత్రలో సాగిపోవాలన్న, ఆత్మీయ జీవితాన్ని
ప్రార్ధనలో పొందాలి అన్న నీ మోకాళ్ళను బలహీన పరచే జోడు తేసేయ్. పరిశుద్ధాత్ముడు
పౌల్ ద్వారా వ్రాయించారు, నీకు ఎదురయ్యే శత్రువును
ఎదుర్కోవాలి అంటే నీకు బలం అవసరం, అందుకే ఒక మంచి జోడు
వేసుకోమని. ఎపేసి 1:15 పాదములకు సమాధాన సువార్తవలనైన
సిద్ధమనస్సను జోడు తోడుగుకుని నిలువబడుడి. నీవు విస్వాసివి కావొచ్చు, సేవకుడవు కావొచ్చు సమాధాన సువార్త వలన సిద్ధమనస్సు ఉంటేనే నీవు క్రీస్తుతో
కూడా పైకి మధ్యకాసానికి ఎక్కగాలవు, ప్రార్ధించ గలవు, నీ శత్రువును ఎదుర్కొన గలవు. నీ మోకాళ్ళ అనుభవాన్ని పాడుచేస్తున్న ప్రతి
విధమైన తంత్రములు, ఆలోచనలు, క్రియలు,
నీ జీవితం లో లయమగును గాక! నీవు ప్రభువును ఎదుర్కోను బలము పొందుధువు
గాక! నిన్ను బలవంతుణ్ణి చేసే సిద్ధమనసు పొందుదువు గాక!
మీ కొరకు ప్రార్ధించే,
షలోమ్
అపోస్తులు: నెల్లి
నాని బాబు
No comments:
Post a Comment