జార్జియా, అశ్లిన్ అనే అమ్మాయికి ఒక వింత వ్యాధి ఉంది. దానివలన ఆమె శరీరంలో నొప్పి తెలియదు. శరీరం కాలిపోతున్న, తెగిన, కొట్టిన తనకు ఏవిధమైన నొప్పి ఉండదు. ఆమెకు చిన్న నాటి నుండి అలానే ఉంది, స్కూల్ లో టీచర్స్ చెపుతున్నారు కొట్టిన ఎడ్వదు, పడిపోయిన ఎడ్వదు, ఆడుకునే టప్పుడు రక్తం వచ్చేలా దెబ్బలు తగిలిన ఎడ్వదు అని. అది ఒక వింత వ్యాధి అని డాక్టర్స్ చెప్పేవరకు వాళ్ళ తల్లి తండ్రి కి తెలియదు. దేవా మా కుమార్తెకు నొప్పి తెలిసేటట్టు చెయ్యి నాయనా, తన మీద కనికరం చూపించు అని తన తల్లి తండ్రి ప్రతి రోజు ప్రార్ధన చేస్తున్నారు. నొప్పి లేకపోతే మంచిదే కదా? మరి ఎందుకు నొప్పి? ఆమె బ్రతకాలి అంటే నొప్పి కావాలి. ఈ జీవిత యాత్రలో నొప్పి కి చాలా ప్రాధాన్యత ఉంది. నొప్పి వలన ఏదో తప్పు జరిగింది అనేది తెలిస్తుంది, దానినుండి మనం తప్పించు కోడానికి వీలవుతుంది. నొప్పి లేకపోతే మరణానికి దగ్గరగ ఉన్నట్టే. నొప్పి ఉంటేనే మన శరీరంలో కలిగే మార్పులను గమనిన్చుకోగలం. అలాగే జీవితంలో కూడా నొప్పి, శ్రమలు, మనలను క్రమపచడానికి దేవుడు పెట్టిన ఒక హెచ్చరికలు. శ్రమలు లేకుండా చెయ్యడం దేవునికి అసాధ్యమయినది కాదు కానీ అది మనకు అవసరం. ఆ శ్రమలు మనలను దేవుని యొద్దకు నడిపిస్తాయి. ఎందుకు శ్రమలు వచ్చాయో మనం గమనిన్చుకోగాలిగితే, వాటిని ప్రభువు దగ్గర ఒప్పుకోగాలిగితే అయన మనకు అస్రయముగా ఉంటారు. శ్రమలు మనలను పరిపుర్నులుగా చేస్తాయి, జీవం గలిగిన వారిగా చేస్తాయి. శ్రమలను జయించిన యేసు వారు మనకు ఉండగా బయమెల సోదరా.. సోదరి...యాకోబు 1:12 -14, 2 కొరింది 4:17; యోహాను 16:33,
మీకోరకు ప్రార్ధించే,
అపోస్తులు నాని బాబు నెల్లి.
source
source
No comments:
Post a Comment