ప్రియ దైవ జనులకు, క్రైస్తవ సహోదరి సహోధరులకు ప్రభునామమున శుభములు,
మీతో ప్రాకారపు
గోడను గూర్చి పంచుకోవాలని ఆశతో ప్రార్ధిస్తున్నాను. ప్రాకారపు గోడ అనగానే మనకు
గుర్తుకు వచ్చేది. యేరికో గోడ. అయితే అసలు ప్రాకారపు గోడలను ఎందుకు కట్టుకున్నారో
అలోచాన చేస్తే, తమ పట్టణ ప్రజలను, రాజులను,
ఆహార నిల్వలను, ధనాగారాన్ని, ఇతర దేశ రాజుల బారినుండి కాపాడుకోడానికి కస్టపడి కట్టుకున్న రక్షణ గోడ.
ఒకరకంగా ఇది మిలటరీ విధానం. ఇవి పెద్ద పెద్ద రాల్లతో కట్టబడ్డాయి. తరువాత కాలం లో
కాల్చిన ఇటుకలతో కట్టబడ్డాయి. మన
బైబిల్ గ్రంధం లో యేరికో పట్టణం చుట్టూ ప్రాకారపు గోడ ఉన్నట్టు తెలిస్తుంది.
యేరుషలెము చుట్టూ ప్రాకారపు గోడ ఉన్నట్టు మనం చూడగలం, దానిని నేహేమ్య కాలం లో పునరుధరించి నట్టు మనకు తెలుసు. ప్రాకారపు
గోడ చాల సందర్బాలలో శత్రువుల నుండి కాపాడటానికి, దురాక్రమణ
జరగకుండా చెయ్యడానికి, లోపల ఉన్నవారు స్వేచ్చగా
బ్రతకడానికి, ధైర్యంగా ఉండటానికి సహకరిస్తుంది. అందుకనే
చైనా లో ప్రాచీన ప్రజలు తమ దేశానికి బలమైన ప్రంపంచంలోనే అతి పోడిగాటి గోడ
కట్టుకున్నారు. అయితే దేవుని ప్రజలమైన మనము కూడా ఒక గోడ కట్టుకోగాలితే నేటి సంఘము
సురక్షితంగా ఉండగలుగుతుంది. మన రాబోవు తరాలకు ఒక స్వేచ్చా పూర్వకమైన జీవితాలను
ఇవ్వగలము. రాతి తో కట్టబడిన గోడ వలె మనం
క్రీస్తు రక్తములో కడుగబడి సజీవమైన రాళ్ళ
వలె ( 1 పేతురు 2: 5 1 Peter ) ఇక్యతతో (
కీర్తనలు 133 Ps, యెహను 17:22 John ) సంఘటితమై
మన ప్రబువు సన్నిధిలో ప్రార్ధించ గలిగితే ( మత్తయి 18:19 Matt ) ఒక బలమైన ప్రార్ధన గోడను మన దేశం లో కట్టు కోగాలము. ప్రార్ధన ప్రాకారము
ధాటి రాగలిగిన శక్తీ ఎవనికిని లేదు. అందుకోసమే ఇండియా ప్రార్ధన కూటమి ని ఎర్పాటు
చేసాము. క్రైస్తవ సమాజానికి ఒక రక్షణ వలయాన్ని
నిర్మిద్దాం కదలి రండి. వ్యక్తిగతం గా గాని , కుటుంభం గా గాని,
సంఘముగా గాని, ప్రార్ధన సహవాసములుగా
గాని ఒకటవుదాము. ఎక్కడి నుండైన
సరే నెలకు ఒక గంట, సంఘముగా ఒక రోజు మీ స్తలలోనుండి ఒక
గోడగా ఆగిపోని బలమైన దుర్గముగా ప్రార్ధన గోడను కటుదాం, దేశం
లో పరిస్థితులను మార్చుదాం, దేశం లో రుపంతరతను చూద్దాం...
మాతో కలసి దేశ క్షేమం కొరకు ప్రార్ధించ దలిస్తే , నెలకు
ఒక గంట మీకు అనుకుమైన సమయాన్ని మాకు తెలియ పరచండి. నమోదు చేసుకుని మీకు గుర్తు
చెస్తం. మీరు ఉన్న చోటునుండే ప్రార్ధించ వచ్చు. మీ తోటి వారికి తెలియ పరచండి.
సంఘముగా కూడా కలసి ఒక రోజు ఏర్పరుచుకుని ప్రార్ధించ
వచ్చు,
మాకు తెలియ పరచండి. 24 గంటలు, 30 రోజులు
కమపరచ బడేటట్టు ప్రణాళిక చేస్తాము. మా సంఘము ప్రతి నెల 1 వ తారికున 24 గంటలు,
ఒకొక్కరు గంట గాని అరగంట గాని ఏర్పరుచుకుని ప్రార్ధిస్తున్నారు.
మా సంఘాలలో గొప్ప మార్పును మేము చూడగలుగుతున్నాము. మీ సంగాలలో, ప్రాంతంలో గొప్ప మార్పును కలిసి చుధం.
వివరాలకు 7989
744 799,
లేక www.bit.ly/iplnani
ప్రభువు సేవలో
.... అపోస్తులు నాని బాబు నెల్లి
No comments:
Post a Comment