Wednesday, June 17, 2020

నూతన నిబంధన మందిరం


క్రొత్త నిబంధన సంఘాలు మందిరాలు ఎలా ఉండేవి? 

ఈ రోజుల్లో మందిరాలకు చాల ప్రముక్యాన్ని ఇస్తున్నారు. నేను కూడా అలానే అలొసించి ఇల్లు కట్టు కోవడం మాని మందిరాలు కట్టాను. కడకు ఉండటానికి ఇల్లు లేని వాడిగా ఉన్నాను. అయితే ఈ మద్య ఒక దైవ జనుడు వ్రాసిన పుస్తకం చదివాను. అసలు విషయం తెలిసి కొంచెం చింత పడ్డాను. క్రొత్త నిబంధన లొని సంఘ నికి పాత నిబంధన సంఘాని కి చాల వ్యత్యాసం ఉంది. పాత నిబంధనలొ దేవుడు ఇస్రయెలియుల మధ్య నివాసముండటానికి ఒక మందిరం కట్ట మన్నారు. కొత్త నిబంధన సంఘం కాలములో మన శరీరాన్ని ఒక ఆలయంగా నిర్మించమన్నరు.

1కోరింథీయులకు 6: 19 మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు


 క్రీస్తు ప్రభుల వారు మరణం పునరుదానం  కట్టబడిన సంఘం మొదటిగా మార్కు గారి ఇంటిలో కూడుకుని ప్రార్ధించారు. అక్కడనె పరిశుద్ద ఆత్మ కుమ్మరింపు జరిగినది. పెతురు చర్మ కారుని ఇంట్లో ప్రార్ధన చెసారు, క్కోర్నెలి ఇంట్లో ప్రార్ధన జరిగింది. ఇంచు మించు 350 సంవత్సరం వరకు సంఘాలు కుడికొటానికి మందిరాలు లేవు గృహలలొ కూడుకుని ప్రార్ధించెవారు. మందిరాలు రోమా చక్రవర్తి కాన్ స్టంటైన్ కాలంలో మొదటిగా మందిరం కట్ట బడింది. అదికూడా ఒక హాల్ లా ఉండేది. తరువాత కాలంలో దానికి చేర్పులు మార్పులు చేసి బలిపిటం, వేదిక జత చేస్తూ వచ్చారు. 

మందిరం ఎందుకు అంటె ఆత్మీయ మందిరాలు అనగా విస్వాసులు కలసి ఒక చోట కూడి వాక్యం ద్వార బలపరచ బడటానికి ఉధ్దేసించి నది. మందిరం కంటె నూతన నిబంధన కాలములో శరీరమే దేవుని ఆలయముగా చెయ్యాలని ఆయన తపన.   సంఘం గా మనం ఒక చోట కూడుకుని విశ్వాసం లొ బలపడటానికి మందిరం ... అయన అంటారు హస్త కృథ్యములు అయిన నివసింపను మీ హృదయం లొనె నివసిస్థాను అన్నారు.. అపో.కార్యములు 7: 50 సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.

ఒక మందిరం కట్టడం కంటె నశించి పోతున్న ఆత్మలు పట్ల భారం కలిగి ఉండాలి అని ఉద్దేశ్యం. మందిరాలు కట్ట కుడధా అంటే అవి కూడా అవసరమే కాని ప్రాముక్యం కాదు. దేవునికి విలువ ఇవ్వని వాడు మందిరానికి ఇస్తాడు... ఉదాహరణకు బయట చుట్టలు కాలుస్తారు మందిరానికి వచ్చినప్పుడు బయట పెట్టి వస్తారు. అసలు దేవుని ఆలయం కట్టిన అలయమా ... నీ సరిరమా...  అలాగే బయట బూతులు మాట్లాడతారు ఆలయం లొ స్తుతులు చేస్తారు..... అసలు పరిశుధంగా ఉండాలసింధి బిల్డింగులా మన సరీరమా.... అలొసించండి..... దేవుడు కోరుకున్న ఆలయం ఏది, మనం దేనికి ప్రాధాన్యత ఇస్థున్నము... అప్పుడు అనిపించింది సాధారణ ఆలయాలు కట్టుకుని  కొంత  సొమ్ము ఆత్మల రక్షణ కొరకు వాడి  ఉంటె బాగుండేది కధా అనిపించింది.... ఆలయాలు మనం కుడుకుని అరాధన చెయ్యడానికి మాత్రమే... దేవుడు నివాస ముండెది మన శరీరం లొనె, అదే అయన ఆలయం.... దీనిని పరిశుద్దం గా ఉంచితే అదే ఆయనకు ఇష్టం .....

No comments:

Post a Comment