Sunday, September 20, 2020

పరలోకానికి మన ధనం పట్టుకెళ్ళే అవకాశం ఇచ్చారు


ఒక మంచి జ్ఞానోదయo కలిగించే  ఉదాహరణ లాంటి నిజం  :-

 ఒకడు ఎలాగైనా ధనం సంపాదించాలని ,
చాలా కస్టపడి సుమారు 1,000 కోట్లు రూపాయిలు సంపాదించాడు.

ఒకరోజు , తాను  ఎంతో కష్టపడి , చెమటోడ్చి సంపాదించిన ధనం ,  తాను చనిపోయినా సరే ఎవరికీ , ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని , బాగా ఆలోచించి , 

 పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు, ఏమని అంటే , ఎవరైతే నేను చనిపోయిన తరువాత నా డబ్బు నాతో తీసుకొని వెళ్లే సులువు (టెక్నిక్) చెపితే వారికి 10 కోట్లు ఇస్తానన్నాడు. నెల గడిచినా ఎవరు రాలేదు. మల్లీ 100, 200 కోట్లు ఇస్తానన్నా ఒక్కరు కూడా రాలేదు. దానితో చాలా బెంగతో , చిక్కి సగం అయిపోయి ఉండగా......

ఈలోగా అకస్మాత్తుగా  ఒక  జ్ఞాని వచ్చి 

నేను మీ డబ్బు మీరు చనిపోయిన  తరువాత కూడా మీకు  ఉపయోగపడే సులువు టెక్నిక్  చెపుతాను అని అన్నాడు.

 ఎలా ?  అని ప్రశ్నించేడు కోటీశ్వరుడు.

దానికి ఆ జ్ఞాని కోటీశ్వరునికి మీరు అమెరికా , ఇంగ్లండ్ , జపాన్ వెళ్ళారా ? అని అడిగేడు.
 Ans :-Yes.
 Q ;-   అమెరికాలో మీరు ఎన్ని  రూపాయలు ఖర్చు చేశారు అని అడిగాడు 
   Ans: - నా Indian currency అమెరికాలొ చెల్లదు. 

కనుక నా రూపాయలను డాలర్లు గా మార్చి తీసుకొని వెలతాను ,  అదే England ఆయితే pounds , జపాన్ ఆయితే Yens ఇలా ఏదేశం వెళ్తే , ఆ దేశ కరెన్సీ క్రింద నా రూపాయలను మార్చి ,  ఖర్చుకి తీసుకొని వెళ్తాను అని అన్నాడు..     

 ఇప్పుడు జ్ఞాని ఇచ్చిన సలహా

ఓ కోటీశ్వరుడా..

 అలాగే నీవు చనిపోయిన తరువాత కూడా  , నీడబ్బు నీతో రావాలంటే , ఒకవేళ నీవు నరకానికి వెల్లాలి అని అనుకుంటే నీడబ్బును   పాపము " లోనికి  మార్చు. అంటే దుర్వినియోగం ,చెడు వ్యసనాలకి , పాపపు పనులలోనికి మార్చు.

 లేదా ..... ఒక వేళ నీవు దేవలోకానికి వెళ్లాలంటే , నీ డబ్బును  దాన , ధర్మములు చేసి పుణ్యంగా Exchange   చేయు అని  చెప్పగానే .........

 ఆ ధనవంతునికి  జ్ఞానోదయం కలిగి , ఆ జ్ఞానికి 100 కోట్లు  తీసుకోమంటాడు. 

దానికి జ్ఞాని నేను కస్టపడి
 పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను అని సున్నితంగా తిరస్కరిస్తాడు.

 అప్పుడు జ్ఞానోదయం ఆయిన ఆ ధనవంతుడు , తన ఆస్తికి ఆ జ్ఞానినే  Maneger గా నియమించి , తగిన జీతం ఇచ్చి , తన సంపద అంతా సన్మార్గంలోనికి , పుణ్యo లోనికి , జ్ఞాని సలహాతో ఖర్చు చేయగా ,

అయ్యా..... ఇదండీ సంగతి  

మన సంపదలు మనతో వచ్చే విధానం

ఇక మన ఇష్టమే .

మనం కష్టపడి సంపాదించినది మంచి ధర్మ  మార్గం లో  ఖర్చు చేసి ,  పుణ్యం గా మార్చి  మనతో తీసుకొని వెల్దామా ?

     లేక

మన తలనొప్పిని కూడా తీసుకోలేని వారికి వదిలి వెల్దామా ?

మత్తయి 6: 20
పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.

1 comment:

  1. A great illustration for the sermons.. thank you so much..

    ReplyDelete