Saturday, December 7, 2019

సంప్రదాయం, కట్టుబాటు దేవుని దగ్గరకు వెళ్ళ కుండ ఆవుతున్నయా?


The Word Today     

సంప్రదాయం, కట్టుబాటు

ఒకరోజు నాకు తెలిసిన ఒక కుటుంబం లో ఒకతను మరణించాడు. అయితే అందరు వచ్చారు కాని ఒకామె మాత్రం రాలేదు. ఎందుకు రాలేదు అని అరా తీస్తే తను ప్రెగ్నెంట్ అట అందుకని రాకుడదని రాలేదట. మరణించిన వ్యక్తి మరల చూద్దామన్న కనిపించడు కదా.. అందులోనూ ఆరెండు కుటుంబాలు చాల సన్నిహితమయినవి. ఇక్కడ తనను చివరి చూపు చూడకుండా చేసింది ఒక సంప్రదాయం. మానవ సంప్రదాయాలు ఇక్కడే కాదు దేవుని దగ్గరకు  కూడా రాకుండా అపుచేస్తున్నాయి. బైబిల్ లో 12 సంవత్సరాల నుండి ఆగని రక్త స్రావం వలన బాధపడుతుంది ( లూకా 8:43 ). ఆ వ్యాధి ఉన్నవారు బయటకు రాకూడదు, జనాలలో తిరగాకుడదు అనే సంప్రదాయం ఆరోజుల్లో ఉంది ( లేవి 15: 19 -30 ). అది ఇరోజుల్లో కూడా ఉంది. కాని తను కట్టుబాటును, సంప్రదాయాన్ని ప్రక్కన బెట్టి జనాలలోనికి వచ్చింది, ముట్టకూడదు అనే ఆచారాన్ని ప్రక్కన బెట్టి యేసయ్య వారి వస్త్రాన్ని ముట్టుకుంది. వెంటనే స్వస్థత పొందుకుంది. సంప్రదాయం, కట్టుబాటు, ఆచారం అనుకుని ఇంట్లోనే ఉండి ఉంటె తను తన జీవితంలో ఆరోగ్యం పొందేది కాదు. సృష్టి కర్తయైన దేవుని దగ్గర ఇవేమీ పనిచెయ్యవు, నీ మాలిన్యం వలన మలినమయ్యేంత శక్తీ హినుడు కాదు మన యేసయ్య. యేసు వారిని వెంబడించడానికి అవేమి అడ్డు కాకూడదు, వాటన్నిటిని విడచి రా.. గొప్ప దీవెనలు తో ఆయన  నీకోసం ఎదురు చూస్తున్నారు. ( మత్తయి 15: 6, యెషయ 29: 13 )

ప్రభువైన యేసు నిన్ను ఆసిర్వధించును గాక!

ప్రభు ఖైది,
అపోస్తులు నాని బాబు నెల్లి,
990 882 3196
7989 744 799
http://bit.ly/jcphindia

source


No comments:

Post a Comment