ఒకరోజు ఒక సేవకుడు
నల్లజర్ల నుండి నాకు ఫోన్ చేసారు. అయన మామధ్య సహవాసం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు.
అయన నాకు గుర్తు రావడం లేదు. అయన కొన్ని గుర్తులు చెప్పి మా సహవాసాన్ని గుర్తు
చేసారు. ఎందుకు అంత శ్రమ అంటే మాకు పరిచయం ఉంది కాని దాన్ని మేము కొనసాగించలేదు, మా మధ్య సంభాషణ లేదు, మరల
మేమెప్పుడు మాట్లాడుకోలేదు. కాబట్టి మా పరిచయం దూరం అయ్యిపోయింది. మమ్మల్ని మేము
మరల పరిచయాలు చేసుకోవలసి వచ్చింది. అప్పుడు నాకు ఒక ఆలోచన ప్రభువు ఇచ్చారు. మనం
కూడా ప్రభువు తో మాట్లాడటం మానేస్తే దేవునికి మనం కూడా దూరం అయ్యిపోతాము కదా అని.
అయితే దేవునికి మనలను దురం చెయ్యడానికి సాతానుడు వాడే ఒక ఆయుధం మనలను ప్రార్ధనకు
దురం చెయ్యడం. మనల్ని ప్రార్ధనకు ఏదోలా దూరం చేస్తే మన తండ్రితో సహవాసం కోల్పోతాం
అప్పుడు వాడు మనల్ని తన కోరల్లో నలిపి విశ్వాస బ్రస్టుల్ని చేసి పతనం చేస్తాడు.
ప్రార్ధనా చెయ్యక పోడానికి ఎన్నో వంకలు నీకు చూపించ వచ్చు. జాగ్రత్త. ప్రార్ధనా మన
ఊపిరి. అది ఆగిపోతే ఆత్మీయంగా మరణమే.... ఎంత ఎక్కువ ప్రార్ధనా చేస్తే అంత పెద్ద
వలయం నీ చుట్టూ ఏర్పడుతుంది అది నిన్ను సాతాను భాణాల నుండి కాపాడుతుంది. అయితే నీకు
యుక్తమయిన ప్రార్ధన నేర్పడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నారు. అటువలె ఆత్మయు
మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా
మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప
శక్యముకాని మూలుగులతొ ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమ 8:26
ROM. అయితే మనం ప్రార్ధనా నేర్పు
పరిశుధాత్మను పంపమని ప్రభును వేడుకోగాలితే చాలు.... మరి ఈరోజు ప్రార్ధనా
చేశావా.... గమనించుకో అపవాది నీ మీద దృష్టి పెట్టి నిన్ను దేవునికి దురం
చెయ్యడానికి ప్రార్ధనకు నిన్ను దురం చేస్తున్నాడేమో..... ఒకవేళ ఈరోజు ఇంకా
ప్రార్ధనా చెయ్యక పోతే వెంటనే వీలైతే మోకరించు లేకపోతే నిలువబడి ప్రార్ధించు.....
దేవుడు నీకు ప్రార్ధనా ఆత్మను అనుగ్రహించును గాకా.
( source )
( source )
షలోం.
మీ కొరకు ప్రార్ధించే
అపొస్తులు నాని బాబు
నెల్లి
No comments:
Post a Comment