Sunday, September 20, 2020

what happens when we do what God asked us to do?


When God told you to do something do not hesitate to do that, do not see the qualities, qualifications according your perspectives... 

Samuel also did same to anoint as king but God sees the heart, David was shepherd but became King, and man after His own heart. Ananias also hesitated to anointe Saul, thinking as he was persecuter of Church.... 

God's view always different from man's view .... 

Here is what will happen if you obey to God's voice

1. Heart of the man who seeks God will be satisfied 
2. His Faith increases
3. Some one's payer answered 
4. Man can work with revival and more powerfully, faithfully.
5. The name of the Lord will be glorified 
6. People can understand who God is, the ability of God, that He can lift man from ashes to throne.
7. It gives life to Generations.
8 You agreeing and obeying with God's selection,
9. You will be rewarded for obeying,
10. You are allowing Kingdom of God to be extended,
11. You are allowing God's will to be done,
12. Some one tears will wiped away.... 
13. You will be a good steward in GOD'S SIGHT...
14. You are not a breaker of things God made to work together for the good of His people, you will be the part of His plan.... 

Are you Obeying  or Hesitating to obey to His call, vision, Word.... 

Be blessed and be a blessing....

పరలోకానికి మన ధనం పట్టుకెళ్ళే అవకాశం ఇచ్చారు


ఒక మంచి జ్ఞానోదయo కలిగించే  ఉదాహరణ లాంటి నిజం  :-

 ఒకడు ఎలాగైనా ధనం సంపాదించాలని ,
చాలా కస్టపడి సుమారు 1,000 కోట్లు రూపాయిలు సంపాదించాడు.

ఒకరోజు , తాను  ఎంతో కష్టపడి , చెమటోడ్చి సంపాదించిన ధనం ,  తాను చనిపోయినా సరే ఎవరికీ , ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని , బాగా ఆలోచించి , 

 పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు, ఏమని అంటే , ఎవరైతే నేను చనిపోయిన తరువాత నా డబ్బు నాతో తీసుకొని వెళ్లే సులువు (టెక్నిక్) చెపితే వారికి 10 కోట్లు ఇస్తానన్నాడు. నెల గడిచినా ఎవరు రాలేదు. మల్లీ 100, 200 కోట్లు ఇస్తానన్నా ఒక్కరు కూడా రాలేదు. దానితో చాలా బెంగతో , చిక్కి సగం అయిపోయి ఉండగా......

ఈలోగా అకస్మాత్తుగా  ఒక  జ్ఞాని వచ్చి 

నేను మీ డబ్బు మీరు చనిపోయిన  తరువాత కూడా మీకు  ఉపయోగపడే సులువు టెక్నిక్  చెపుతాను అని అన్నాడు.

 ఎలా ?  అని ప్రశ్నించేడు కోటీశ్వరుడు.

దానికి ఆ జ్ఞాని కోటీశ్వరునికి మీరు అమెరికా , ఇంగ్లండ్ , జపాన్ వెళ్ళారా ? అని అడిగేడు.
 Ans :-Yes.
 Q ;-   అమెరికాలో మీరు ఎన్ని  రూపాయలు ఖర్చు చేశారు అని అడిగాడు 
   Ans: - నా Indian currency అమెరికాలొ చెల్లదు. 

కనుక నా రూపాయలను డాలర్లు గా మార్చి తీసుకొని వెలతాను ,  అదే England ఆయితే pounds , జపాన్ ఆయితే Yens ఇలా ఏదేశం వెళ్తే , ఆ దేశ కరెన్సీ క్రింద నా రూపాయలను మార్చి ,  ఖర్చుకి తీసుకొని వెళ్తాను అని అన్నాడు..     

 ఇప్పుడు జ్ఞాని ఇచ్చిన సలహా

ఓ కోటీశ్వరుడా..

 అలాగే నీవు చనిపోయిన తరువాత కూడా  , నీడబ్బు నీతో రావాలంటే , ఒకవేళ నీవు నరకానికి వెల్లాలి అని అనుకుంటే నీడబ్బును   పాపము " లోనికి  మార్చు. అంటే దుర్వినియోగం ,చెడు వ్యసనాలకి , పాపపు పనులలోనికి మార్చు.

 లేదా ..... ఒక వేళ నీవు దేవలోకానికి వెళ్లాలంటే , నీ డబ్బును  దాన , ధర్మములు చేసి పుణ్యంగా Exchange   చేయు అని  చెప్పగానే .........

 ఆ ధనవంతునికి  జ్ఞానోదయం కలిగి , ఆ జ్ఞానికి 100 కోట్లు  తీసుకోమంటాడు. 

దానికి జ్ఞాని నేను కస్టపడి
 పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను అని సున్నితంగా తిరస్కరిస్తాడు.

 అప్పుడు జ్ఞానోదయం ఆయిన ఆ ధనవంతుడు , తన ఆస్తికి ఆ జ్ఞానినే  Maneger గా నియమించి , తగిన జీతం ఇచ్చి , తన సంపద అంతా సన్మార్గంలోనికి , పుణ్యo లోనికి , జ్ఞాని సలహాతో ఖర్చు చేయగా ,

అయ్యా..... ఇదండీ సంగతి  

మన సంపదలు మనతో వచ్చే విధానం

ఇక మన ఇష్టమే .

మనం కష్టపడి సంపాదించినది మంచి ధర్మ  మార్గం లో  ఖర్చు చేసి ,  పుణ్యం గా మార్చి  మనతో తీసుకొని వెల్దామా ?

     లేక

మన తలనొప్పిని కూడా తీసుకోలేని వారికి వదిలి వెల్దామా ?

మత్తయి 6: 20
పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.

Wednesday, June 17, 2020

నూతన నిబంధన మందిరం


క్రొత్త నిబంధన సంఘాలు మందిరాలు ఎలా ఉండేవి? 

ఈ రోజుల్లో మందిరాలకు చాల ప్రముక్యాన్ని ఇస్తున్నారు. నేను కూడా అలానే అలొసించి ఇల్లు కట్టు కోవడం మాని మందిరాలు కట్టాను. కడకు ఉండటానికి ఇల్లు లేని వాడిగా ఉన్నాను. అయితే ఈ మద్య ఒక దైవ జనుడు వ్రాసిన పుస్తకం చదివాను. అసలు విషయం తెలిసి కొంచెం చింత పడ్డాను. క్రొత్త నిబంధన లొని సంఘ నికి పాత నిబంధన సంఘాని కి చాల వ్యత్యాసం ఉంది. పాత నిబంధనలొ దేవుడు ఇస్రయెలియుల మధ్య నివాసముండటానికి ఒక మందిరం కట్ట మన్నారు. కొత్త నిబంధన సంఘం కాలములో మన శరీరాన్ని ఒక ఆలయంగా నిర్మించమన్నరు.

1కోరింథీయులకు 6: 19 మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు


 క్రీస్తు ప్రభుల వారు మరణం పునరుదానం  కట్టబడిన సంఘం మొదటిగా మార్కు గారి ఇంటిలో కూడుకుని ప్రార్ధించారు. అక్కడనె పరిశుద్ద ఆత్మ కుమ్మరింపు జరిగినది. పెతురు చర్మ కారుని ఇంట్లో ప్రార్ధన చెసారు, క్కోర్నెలి ఇంట్లో ప్రార్ధన జరిగింది. ఇంచు మించు 350 సంవత్సరం వరకు సంఘాలు కుడికొటానికి మందిరాలు లేవు గృహలలొ కూడుకుని ప్రార్ధించెవారు. మందిరాలు రోమా చక్రవర్తి కాన్ స్టంటైన్ కాలంలో మొదటిగా మందిరం కట్ట బడింది. అదికూడా ఒక హాల్ లా ఉండేది. తరువాత కాలంలో దానికి చేర్పులు మార్పులు చేసి బలిపిటం, వేదిక జత చేస్తూ వచ్చారు. 

మందిరం ఎందుకు అంటె ఆత్మీయ మందిరాలు అనగా విస్వాసులు కలసి ఒక చోట కూడి వాక్యం ద్వార బలపరచ బడటానికి ఉధ్దేసించి నది. మందిరం కంటె నూతన నిబంధన కాలములో శరీరమే దేవుని ఆలయముగా చెయ్యాలని ఆయన తపన.   సంఘం గా మనం ఒక చోట కూడుకుని విశ్వాసం లొ బలపడటానికి మందిరం ... అయన అంటారు హస్త కృథ్యములు అయిన నివసింపను మీ హృదయం లొనె నివసిస్థాను అన్నారు.. అపో.కార్యములు 7: 50 సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.

ఒక మందిరం కట్టడం కంటె నశించి పోతున్న ఆత్మలు పట్ల భారం కలిగి ఉండాలి అని ఉద్దేశ్యం. మందిరాలు కట్ట కుడధా అంటే అవి కూడా అవసరమే కాని ప్రాముక్యం కాదు. దేవునికి విలువ ఇవ్వని వాడు మందిరానికి ఇస్తాడు... ఉదాహరణకు బయట చుట్టలు కాలుస్తారు మందిరానికి వచ్చినప్పుడు బయట పెట్టి వస్తారు. అసలు దేవుని ఆలయం కట్టిన అలయమా ... నీ సరిరమా...  అలాగే బయట బూతులు మాట్లాడతారు ఆలయం లొ స్తుతులు చేస్తారు..... అసలు పరిశుధంగా ఉండాలసింధి బిల్డింగులా మన సరీరమా.... అలొసించండి..... దేవుడు కోరుకున్న ఆలయం ఏది, మనం దేనికి ప్రాధాన్యత ఇస్థున్నము... అప్పుడు అనిపించింది సాధారణ ఆలయాలు కట్టుకుని  కొంత  సొమ్ము ఆత్మల రక్షణ కొరకు వాడి  ఉంటె బాగుండేది కధా అనిపించింది.... ఆలయాలు మనం కుడుకుని అరాధన చెయ్యడానికి మాత్రమే... దేవుడు నివాస ముండెది మన శరీరం లొనె, అదే అయన ఆలయం.... దీనిని పరిశుద్దం గా ఉంచితే అదే ఆయనకు ఇష్టం .....

Thursday, January 23, 2020

కృతజ్ఞత



sermon prepared and preached on January 2017 by apostle Nani Babu Nelli.


కృతజ్ఞత

కృతజ్ఞత పండుగ అనేది ప్రతి సంవత్సరం నవంబర్ 26న అమెరికా వారు జరుపుకుంటారు. కాని మనం ప్రతి రోజు దేవునికి  కృతజ్ఞులమై ఉండాలి.

1 దేస్స 5 : 18 - ప్రతి విషయమునందును కృతజ్ఞుతా స్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.

రోమ 1: 21 మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, క్రుతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు.

v  నామకార్ధ క్రైస్తవుడు, పునర్జివింపని క్రైస్తవుడు కృతజ్ఞతలు చెల్లించలేడు.

v  కాలాన్ని నమ్మేవాడు కృతజ్ఞతలు చెల్లించలేడు. ( ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది అనుకుంటాడు )

v  అదృష్టాన్ని నమ్మే వాడు కృతజ్ఞతలు చెల్లించలేడు.

v  మా కష్టము వలెనే అన్ని చెయ్యగలిగాము అనే వాడు కృతజ్ఞతలు చెల్లించలేడు. ( ద్వితి 8:17 )

క్రైస్తవుడు కృతజ్ఞతలు చెల్లించలేని వాడు ఉండటం అసాధారణ మయినది.

రోమ 8:28

భాహ్యముగా యూదుడు అయినంత మాత్రాన యూదుడు కాదు.
బాహ్యముగా క్రైస్తవుడు అయినంత మాత్రాన క్రైస్తవుడవు కాలేవు. అంతరంగముగా మార్పు రావాలి.

→ ఆపరేషన్ అయిన తరువాత వైద్యునికి థాంక్స్ చెపుతాము, అంటే బాధ వెనుక విడుదల ఉంది.

కృతజ్ఞతలు చెల్లించేటప్పుడు ఎదుట వాడు క్షేమభివ్రుది నొందుతాడు.

1. మాట ద్వారా కృతజ్ఞత స్తుతి ఎపేసి 5: 4

2.  క్రియ ద్వారా కృతజ్ఞత కొలస్సి 5: 17

ఎల్లపుడు కృతజ్ఞత చెల్లించుట వలన లాబాలు.

1. దేవుడు చేసిన మేలులు మరచి పోకుండా ఉండగలము.

2. వచ్చిన శ్రమలలో ఓదార్పు, నిరీక్షణ

ఇంతక ముందు ఆయన చేసిన మేలులు గుర్తు చేసుకుంటూ ఉంటె ఇప్పటి శ్రమలలో కూడా అయన మేలు చేయగలడు అనే నిరీక్షణ ఏర్పడుతుంది.


Monday, January 20, 2020

Bible outline information

*బైబిల్ పూర్తి సమాచారం*
*~~~~~~~~~~~~~~~~~*
1.బైబిల్ మెుత్తము పుస్తకాలు *66*
2.పాత నిబంధన *39*
3.క్రొత్త నిబంధన  *27*
4.పాత నిబంధన అద్యాయాలు *929*
5.క్రొత్త నిబంధన *260*
6.బైబిల్ మెుత్తం *1189*
7.పాత నిబందన వచనాలు *33214*
8.క్రొత్త నిబందన *7959*
9.బైబిల్ మెుత్తం వచనాలు *41,173*
10.పాత నిబందన పదములు *5,93,493*
11.క్రొత్తనిబందన *1,81,253*
12.పాత నిబందన అక్షరములు *27,21,100*
13.క్రొత్తనిబందన *8,45,380*
14.బైబిల్ మెుత్తం *35,66,380*
15.పాతనిబందన "విమెాచన"గూర్చి వచనములు *4,734*
16.క్రొత్త నిబందన *2,934*
17.బైబిల్ మెుత్తం *7,670*
18.బైబిల్ మెుత్తం వాగ్దానములు *30,000*
19.బైబిల్ మెుత్తం ఆజ్ఞలు *6,468*
20.బైబిల్ మెుత్తం ప్రవచనాలు *5,355*
21.నెరవేరిన ప్రవచనాలు *3,268*
22.బైబిల్ మెుత్తం ప్రశ్నలు *3,294*
23.బైబిల్ మెుత్తం దీవెనలు *8000*
24.బైబిల్ లో పెద్ద పుస్తకం *కీర్తనలు*
25.బైబిల్ చిన్న పుస్తకం *యెహాను 3 వ పత్రిక*
26.బైబిల్ పెద్ద అద్యాయం *కీర్తన 119*
27.బైబిల్ చిన్న అద్యాయం *కీర్తన117*
28.బైబిల్ పొడవైన వచనం *ఎస్తేరు8:9*
29.బైబిల్ చిన్న వచనం *1థెస్స5:19*
30.బైబిల్ మద్య వచనముకీర్తన *118:8*
31.పాత నిబందన మధ్య పుస్తకం *సామెతలు*
32.క్రొత్త నిబందనలో మధ్య పుస్తకం *2థెస్స*
33.బైబిల్ మధ్య పుస్తకం *మిాకా,నహూము*
34.పాత నిబందన మధ్య అధ్యాయము    *యెాబు 29*
35.క్రొత్త నిబందన మధ్య అధ్యాయం *-రోమా13*
36.బైబిల్ మధ్య అధ్యాయము  *కీర్తన117*
37.బైబిల్ పొడవైన పేరు-మహేరుషాలాల్ హష్ బజ్ *యెషయా8:3*
38."పరిశుద్దత" అను మాట పాత నిబందనలో *830 సార్లు*
39.క్రొత్త నిబందనల *250సార్లు*
40.యెహోవా అను మాట *7000 సార్లు*
41."దేవుడు మాట్లాడెను" అను మాట  *3000*
42."ప్రభువు" అను మాట *1855 సార్లు*
43.ఏడు అనే సంఖ్య బైబిల్ లో *120 సార్లు*
44.భయపడకుము అనేమాట *366 సార్లు*
45.యేసు అనే పదం *973 సార్లు*
46.దేవదూతలు అనే పదం *309 సార్లు*
47.యేసు ప్రభువని- క్రొత్త నిబందనలో *747 సార్లు*
48.యేసు ప్రభువని,అపోస్తుల; కా *92 సార్లు*
49."సెలా" అనే పదం *71సార్లు*
50.దేవుని రాకడ గురించి *568 సార్లు*

WhatsApp massage

Friday, January 17, 2020

ఏమి ఉన్న లేకున్నా ఆయనయందే ఆనందింతును



Sermon Prepared & preached on 8th April 2018 by apostle Nani Babu Nelli,


హబక్కుకు 3:17 Hab

అంజురపు చెట్లు పుయకుండినను,
ద్రాక్ష చెట్లు ఫలింప కుండినను,
ఒలివ చెట్లు కాపు లేక యుండి నను ,
చేనిలోని పైరు పంటకు రాకపోయినను,
గొర్రెలు దొడ్డిలోని లేక పోయినను,
శాలలోని పశువులు లేక పోయినను,

1. అంజురపు చెట్లు ( Fig Tree )

బైబిల్ లో ప్రస్తావించబడిన చెట్లలో వరుసలో మూడవది.
జీవ వృక్షం, మంచి చెడులు తెలివినిచ్చు వృక్షం, అంజురపు వృక్షం,

ఆదాము అవ్వలు కచ్చడములు కొరకు అంజురపు చెట్టు ఆకులు వాడిరి.
తమ దిగంబరత్వమును కప్పు కొనుటకు వాడిరి.
ఆకులు వస్త్రలుగా వాడిరి,

యెషయ 38:21 Is లో వైద్యానికి అంజురపు ఫలాల ముద్ద వాడమని ప్రభువు వారు చుసించారు.

వస్త్రాలు లేకున్నను ........

2. ద్రాక్ష చెట్టు ( Vine )

యోహాను 2:1 John

విందునకు వాడిరి,

కీర్తనలు 104:15 Ps నరుల హృదయమును సంతోష పెట్టు ద్రాక్ష రసము

హృదయములో సంతోషము లేకున్నా....

౩. ఒలివ చెట్లు ( Olive Tree )

చాల  పవిత్రమయినది గా, అనేక పురాతన గాధలలో లెక్కించబడింది.

సమాధానినికి సూచన

కుటుంబములో, స్నేహితుల మధ్య సమాధానము లేకున్నను....

5. పోలములోని పైరు ( Field )

ఆహారపు కొరత ఏర్పడినను .....

6. గొర్రెలు, పశువులు ( Herd )

సంపద లేకున్నను....

నీను ఆయనలో అనందిన్చేదను ...

2 కొరింది 4:8 - 10 2 Cor; రోమ 5:2 Rom; ఫిలిఫి 4:4 Phil; కీర్తనలు 27 : 1; 46:1 Ps;  యెషయ 12:2 Is;

Thursday, January 16, 2020

కృతజ్ఞతలు ఎలా ఎందుకు ఎప్పుడు చెల్లించాలి.. దానివలన ఆత్మీయ జీవితానికి ప్రయోజనం ఏంటి





కృతజ్ఞత కుడిక నందు సేవకులు అపోస్తులు నాని బాబు గారు అందించిన వాక్యసందేశం... తప్పక వినండి కృతజ్ఞత పట్ల మీకు ఉన్న ఆలోచనలు మారిపోతాయి.... 

find bar-jesus in your life... మీ జీవితం బర్-యేసు ఎవరు?





మీ జీవితం లో బర్ యేసు ఎవరు? గుర్తించు.... 2019 వ సంవత్సరం లో జరిగిన సిలువ ధ్యాన కూడికలు లో అందించిన వర్తమానం. అపోస్తులు కార్యములు గ్రంథమునుండి అపోస్తలు నాని బాబు నెల్లి గారు ప్రార్ధన పూర్వకంగా అందించిన విశ్వాస జివతాన్ని బలపరచే వర్తమానాలు తప్పక విని దేవుని సన్నిధిని అనుభవించండి.

కోర్నేలి కుటుంభం యొక్క లక్షణాలు ఈరోజు మనకు మాదిరి






ఆశిర్వాద కుటుంభ జీవితానికి మాదిరి ... మీ కుటుంభం దివేనకరముగా ఉండుటకు కుటుంబముగా కలిసి వినండి. 2019 సిలువ ధ్యాన కుడికలో అపోస్తులు నాని బాబు గారు అపోస్తులుల కార్యగ్రందము లోనుండి ధ్యాన అంశము ...

సంఘాన్ని హించించిన సౌల్ ని దేవుడు ఎందుకు క్షమించారు... మనం కూడా క్షమించ బడతామా




పౌల్ సంఘాన్ని ఎంత హింసించిన దేవుడు ఎందుకు సిక్షించలేదు... కాని మరింతగా ఎందుకు వాడుకున్నాడు... మనం చేసే తప్పులు కూడా కషమించ బడతాయా..... సందేహాత్మక సందేశం... మీకు ఉన్న సాతాను యొక్క ఆలోచన నుండి విడధలై బయటకు రాగాలుగుటకు చక్కటి సందేశం,,,, SOULS WAS FORGIVEN EVEN HE PERSECUTED CHURCH, SHALL WE ALSO FORGIVEN IF WE DO SIN...

సంఘాన్ని హింసించిన సౌలు క్రీస్తు సాక్షిగా ఎలా మారాడు








2019 సిలువ ధ్యాన కూడికలో అపోస్తులు గ్రంధ ధ్యాన నుండి ఒక బాగం, అపోస్తలు నాని బాబు నెల్లి గారు అందించిన వాక్య సందేశం  ... సౌలు యొక్క మార్పు వెనుక ఉన్న విషయాలు... తప్ప్పక వినండి ... 

బక్తుడైన మార్కు మనకు మాదిరి

2019 వ సంవత్సరం లో జరిగిన సిలువ ధ్యాన కూడికలు లో అందించిన వర్తమానం. అపోస్తులు కార్యములు గ్రంథమునుండి మార్కును గుర్చిన వర్తమానం. తప్పక వినండి. 

Tuesday, January 14, 2020

Birthday sermon పుట్టిన రోజు ప్రసంగము





Birthday sermon

పుట్టిన రోజు ప్రసంగము


మార్కు 10: 13 Mark.  తమ చిన్న బిడ్డలను ముటవలేనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసికొని వచ్చిరి. ( and they brought young children to him, that he should touch him.)

వారు తమ పిల్లలు దేవుని చేతి క్రిందకు తీసుకుని వచ్చారు. అయన వారి మీద చేతులు ఉంచి ఆసిర్వధించినట్లు మనం చూడగలం.

అయన చేతుల క్రింద ఏమి ఉంది. what is there under His hands

1. అయన రెక్కల క్రింద క్షేమము గలదు, ( safe life under God's hand )

 రూతు 2:12 Ruth

2.  ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము గలదు (  Health under His hands )

మలాకి 4 : 2 Malachi

3. ఆయన ఆసిర్వధము అయన రెక్కల క్రింద ఉంది . ( Blessing under His hands )

His blessing brings wealth.
అయన ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇస్తుంది.
సామెతలు 10:22 Proverbs

you too bring your children under His hands, the church. your children will be blessed in this manner.
నీవును నీ బిడ్డలను దేవుని హస్తాలక్రింధకు , మందిరానికి తీసుకుని రా! దేవుని ఈ అసిర్వధములు మీ పిల్లలు పొందుకుంటారు.

Sermon prepared and preached by apostle Nani Babu Nelli.

Saturday, January 11, 2020

ప్రార్ధన ప్రాకారపు గోడ Wall of Prayer


ప్రియ దైవ జనులకు, క్రైస్తవ సహోదరి సహోధరులకు ప్రభునామమున శుభములు,

మీతో ప్రాకారపు గోడను గూర్చి పంచుకోవాలని ఆశతో ప్రార్ధిస్తున్నాను. ప్రాకారపు గోడ అనగానే మనకు గుర్తుకు వచ్చేది. యేరికో గోడ. అయితే అసలు ప్రాకారపు గోడలను ఎందుకు కట్టుకున్నారో అలోచాన చేస్తే, తమ పట్టణ ప్రజలను, రాజులను, ఆహార నిల్వలను, ధనాగారాన్ని, ఇతర దేశ రాజుల బారినుండి కాపాడుకోడానికి కస్టపడి కట్టుకున్న రక్షణ గోడ. ఒకరకంగా ఇది మిలటరీ విధానం. ఇవి పెద్ద పెద్ద రాల్లతో కట్టబడ్డాయి. తరువాత కాలం లో కాల్చిన ఇటుకలతో కట్టబడ్డాయి.  మన బైబిల్ గ్రంధం లో యేరికో పట్టణం చుట్టూ ప్రాకారపు గోడ ఉన్నట్టు తెలిస్తుంది. యేరుషలెము చుట్టూ ప్రాకారపు గోడ ఉన్నట్టు మనం చూడగలం, దానిని నేహేమ్య కాలం లో పునరుధరించి నట్టు మనకు తెలుసు.  ప్రాకారపు గోడ చాల సందర్బాలలో శత్రువుల నుండి కాపాడటానికి, దురాక్రమణ జరగకుండా చెయ్యడానికి, లోపల ఉన్నవారు స్వేచ్చగా బ్రతకడానికి, ధైర్యంగా ఉండటానికి సహకరిస్తుంది.  అందుకనే చైనా లో ప్రాచీన ప్రజలు తమ దేశానికి బలమైన ప్రంపంచంలోనే అతి పోడిగాటి గోడ కట్టుకున్నారు. అయితే దేవుని ప్రజలమైన మనము కూడా ఒక గోడ కట్టుకోగాలితే నేటి సంఘము సురక్షితంగా ఉండగలుగుతుంది. మన రాబోవు తరాలకు ఒక స్వేచ్చా పూర్వకమైన జీవితాలను ఇవ్వగలము. రాతి తో కట్టబడిన  గోడ వలె మనం క్రీస్తు రక్తములో కడుగబడి  సజీవమైన రాళ్ళ వలె ( 1 పేతురు 2: 5 1 Peter ) ఇక్యతతో  ( కీర్తనలు 133 Ps, యెహను 17:22 John ) సంఘటితమై మన ప్రబువు సన్నిధిలో ప్రార్ధించ గలిగితే ( మత్తయి 18:19 Matt ) ఒక బలమైన ప్రార్ధన గోడను మన దేశం లో కట్టు కోగాలము. ప్రార్ధన ప్రాకారము ధాటి రాగలిగిన శక్తీ ఎవనికిని లేదు. అందుకోసమే ఇండియా ప్రార్ధన కూటమి ని ఎర్పాటు చేసాము.  క్రైస్తవ సమాజానికి ఒక రక్షణ వలయాన్ని నిర్మిద్దాం కదలి రండి. వ్యక్తిగతం గా గాని , కుటుంభం గా గాని, సంఘముగా గాని, ప్రార్ధన సహవాసములుగా గాని ఒకటవుదాము.  ఎక్కడి నుండైన సరే నెలకు ఒక గంట, సంఘముగా ఒక రోజు మీ స్తలలోనుండి ఒక గోడగా ఆగిపోని బలమైన దుర్గముగా ప్రార్ధన గోడను కటుదాం, దేశం లో పరిస్థితులను మార్చుదాం, దేశం లో రుపంతరతను చూద్దాం... మాతో కలసి దేశ క్షేమం కొరకు ప్రార్ధించ దలిస్తే , నెలకు ఒక గంట మీకు అనుకుమైన సమయాన్ని మాకు తెలియ పరచండి. నమోదు చేసుకుని మీకు గుర్తు చెస్తం. మీరు ఉన్న చోటునుండే ప్రార్ధించ వచ్చు. మీ తోటి వారికి తెలియ పరచండి. సంఘముగా కూడా కలసి ఒక రోజు ఏర్పరుచుకుని  ప్రార్ధించ వచ్చు, మాకు తెలియ పరచండి. 24 గంటలు, 30 రోజులు కమపరచ బడేటట్టు ప్రణాళిక చేస్తాము. మా సంఘము ప్రతి నెల 1 వ తారికున 24 గంటలు, ఒకొక్కరు గంట గాని అరగంట గాని ఏర్పరుచుకుని ప్రార్ధిస్తున్నారు. మా సంఘాలలో గొప్ప మార్పును మేము చూడగలుగుతున్నాము. మీ సంగాలలో, ప్రాంతంలో గొప్ప మార్పును కలిసి చుధం.

 వివరాలకు 7989 744 799, 
లేక www.bit.ly/iplnani

ప్రభువు సేవలో .... అపోస్తులు నాని బాబు నెల్లి

Friday, January 10, 2020

ఆత్మీయ వ్యాయామం Spiritual Exercise


ఆత్మీయ వ్యాయామం
Spiritual Exercise

ప్రతి రోజు మన శరీర ఆరోగ్యం కొరకు  వ్యాయామం చేస్తూ ఉంటాము, శరీరాన్ని శుబ్రం చేసుకుంటూ ఉంటాము. కాని ఆత్మీయ ఆరోగ్యం కొరకు ప్రతి క్రైస్తవుడు చెయ్యవలసిన వ్యాయామం ఉంది.

Every day we used to do exercise for our body fitness. but we are doing for the fitness of our spiritual life.

here are 7 spiritual exercises for every one's spiritual growth.

1.  Praise every Day ( ప్రతి రోజు స్తుతించుట )

Ps 145:1

2.  Pray everyday ( ప్రతి రోజు ప్రార్ధించు )

Ps 88:9 కీర్తనలు

3.  Read Bible everyday ( ప్రతి రోజు దైవ వాక్యాన్ని చదువు )

Neh 8:18 నేహేమ్య

4. Die everyday ( ప్రతి రోజు చనిపోవాలి )

1 Cor 15:31 1కొరింది

5. Encourege one another ( ఒకరినొకరు బుద్ధి చెప్పుకునుడి )

Heb 3:13 హెబ్రీ

6. Preach everyday ( ప్రతి రోజు సువార్త ప్రకటించుడి )

Ps 96:2 కీర్తనలు 

Thursday, January 9, 2020

వ్యాధుల కు కారణాలు Reasons for sickness


వ్యాధుల కు కారణాలు  Reasons for sickness

యెషయ 1 : 6 Isaiah
అరికాలు మొదలుకుని  తల వరకు స్వస్తస్థ కొంచెమైనను లేదు


1. కలుషితమయిన ఆహారం ( polluted food )

దేవుడు మానవుని శరీరానికి అవసరమైన ఆహారాన్ని ఏ మట్టినుండి అయితే తియ్యబడ్డడో అదే మంటి నుండి మోలిపించారు. అందుకే
ఆది 1: 29 Gen

కాని మానవుడు దేవుడిచ్చిన ఆహారం కంటే తనకు నచ్చిన ఆహారం కాని దాని కోసం ప్రాకులాడుతున్నాడు.మాంసాహారం దేవుడు ఇచ్చినది కాదు అనుమతించింది. మాంసాహారం ప్రారంబం కాకముందు మానవుడు 900+ సంవత్సరాలు బ్రతికాడు. కాని మాంసాహారం తినడం మొదలు పెట్టాక మానవుని ఆయుష్షు తగ్గుతూ వచ్చింది.
మానవుని శరీరంలో ఉన్న మూలకాలు అన్ని  మట్టి లో ఉన్నయి అని పరిశోధకులు తేల్చి చెప్పారు.  అవే ములాకలు మొక్కలలో మనకు దొరుకుతున్నాయి.
మనం నడిపే వాహనం లో ఇంధనం అయిపోతే ఏదైనా ద్రవమే కదా అని నీళ్ళు వేస్తే వాహనం పాడవుతుంది కదా. అలాగే మన శరీరం కూడా...
  
2.  పాపము ( Sin )

మత్తయి 9 : 1 - 8 పక్షవాయువు రోగం తో వ్యక్తిని బాగుచేయుటకు యేసు వారు రోగాన్ని గద్దించ లేదు గాని వాని పాపములను క్షమించారు. కారణం వాని రోగమునకు కారణం పాపము. \
కీర్తనలు Ps 107 : 17; 38 : 3; హోషయ Hos 7 : 1;
జేపన్య Zep 1 : 17 ; మీకా Mic 6: 13

3. దయ్యముల వలన ( By Evil spirits )

మార్క్ 9: 25 Mark
లూకా 13:10 Luk

5. మ్రోక్కుబడులు మరచి పోవడం ( forgetting vows to God )

ప్రసంగి 5 : ౩ - 6 Eccl
సంఖ్యా 30 : 1 - 2, Numbers
ద్వితి 23 : 21 Due

6. దేవుని మహిమర్ధమై ( for God's glory )

యోహాను 9: 1 - 5

ఎలాంటి వ్యాదులైన, ఆ వ్యాధికి కారణం ఏదైనా స్వస్థ పరచువారు యేసు ఒక్కడే.... whatever disease it may be, whatever cause for disease, the solution and healing is from Jesus only... 
యెషయ 53 : 5 Is


Wednesday, December 25, 2019

ప్రార్థన



ఒకరోజు ఒక సేవకుడు నల్లజర్ల నుండి నాకు ఫోన్ చేసారు. అయన మామధ్య సహవాసం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయన నాకు గుర్తు రావడం లేదు. అయన కొన్ని గుర్తులు చెప్పి మా సహవాసాన్ని గుర్తు చేసారు. ఎందుకు అంత శ్రమ అంటే మాకు పరిచయం ఉంది కాని దాన్ని మేము కొనసాగించలేదు,  మా మధ్య   సంభాషణ లేదు, మరల మేమెప్పుడు మాట్లాడుకోలేదు. కాబట్టి మా పరిచయం దూరం అయ్యిపోయింది. మమ్మల్ని మేము మరల పరిచయాలు చేసుకోవలసి వచ్చింది. అప్పుడు నాకు ఒక ఆలోచన ప్రభువు ఇచ్చారు. మనం కూడా ప్రభువు తో మాట్లాడటం మానేస్తే దేవునికి మనం కూడా దూరం అయ్యిపోతాము కదా అని. అయితే దేవునికి మనలను దురం చెయ్యడానికి సాతానుడు వాడే ఒక ఆయుధం మనలను ప్రార్ధనకు దురం చెయ్యడం. మనల్ని ప్రార్ధనకు ఏదోలా దూరం చేస్తే మన తండ్రితో సహవాసం కోల్పోతాం అప్పుడు వాడు మనల్ని తన కోరల్లో నలిపి విశ్వాస బ్రస్టుల్ని చేసి పతనం చేస్తాడు. ప్రార్ధనా చెయ్యక పోడానికి ఎన్నో వంకలు నీకు చూపించ వచ్చు. జాగ్రత్త. ప్రార్ధనా మన ఊపిరి. అది ఆగిపోతే ఆత్మీయంగా మరణమే.... ఎంత ఎక్కువ ప్రార్ధనా చేస్తే అంత పెద్ద వలయం నీ చుట్టూ ఏర్పడుతుంది అది నిన్ను సాతాను భాణాల నుండి కాపాడుతుంది.  అయితే నీకు యుక్తమయిన ప్రార్ధన నేర్పడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నారు. అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతొ ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమ 8:26 ROM. అయితే మనం ప్రార్ధనా నేర్పు పరిశుధాత్మను పంపమని ప్రభును వేడుకోగాలితే చాలు.... మరి ఈరోజు ప్రార్ధనా చేశావా.... గమనించుకో అపవాది నీ మీద దృష్టి పెట్టి నిన్ను దేవునికి దురం చెయ్యడానికి ప్రార్ధనకు నిన్ను దురం చేస్తున్నాడేమో..... ఒకవేళ ఈరోజు ఇంకా ప్రార్ధనా చెయ్యక పోతే వెంటనే వీలైతే మోకరించు లేకపోతే నిలువబడి ప్రార్ధించు..... దేవుడు నీకు ప్రార్ధనా ఆత్మను అనుగ్రహించును గాకా.
source )

షలోం.

మీ కొరకు ప్రార్ధించే
అపొస్తులు నాని బాబు నెల్లి 

Monday, December 23, 2019

జోడు, చెప్పులు



ఒక రోజు నేను చెప్పులు కొనడానికి షాపుకు వెళ్ళాను. అక్కడ కొంచెం పెద్ద వయసు వారు ఉన్నారు. వాళ్ళు నాకు డాక్టర్ సుసించిన చెప్పులు కావలి అన్నారు. షాపు అతను తెచ్చి ఇచ్చాడు. నాకు అర్ధం కాలేదు. డాక్టర్స్ చెప్పులు కూడా చీటి వ్రాస్తారా ? అని. తర్వాత నేను దాని గురుంచి అలోసిస్తే తెలిసింది. మనం సరియయిన చెప్పులు వాడకపోతే, కాళ్ళకు అనుకులమయిన చెప్పులు వాడక పోతే దాని ప్రభావం మోకాళ్ళ మీద పడుతుంది అని అంతర్జాలం లో తెలుసుకున్నాను. చిన్న వయసు నుండి సరియయిన చెప్పులు వాడక పోతే 40+ వచ్చేసరికి మోకాళ్ళ లో సమస్యలు తలెత్తుతాయట. దాని వాలన పైకి మెట్లు ఎక్కలేము, నిబడలేము, నడవలేము, మోకాళ్ళు వేయలేము  అట. నీవు ఉన్నత స్థితికి ఎదగాలి అన్నా, ఆగిపోక నీ జీవిత యాత్రలో సాగిపోవాలన్న, ఆత్మీయ జీవితాన్ని ప్రార్ధనలో పొందాలి అన్న నీ మోకాళ్ళను బలహీన పరచే జోడు తేసేయ్. పరిశుద్ధాత్ముడు పౌల్ ద్వారా వ్రాయించారు, నీకు ఎదురయ్యే శత్రువును ఎదుర్కోవాలి అంటే నీకు బలం అవసరం, అందుకే ఒక మంచి జోడు వేసుకోమని. ఎపేసి  1:15 పాదములకు సమాధాన సువార్తవలనైన సిద్ధమనస్సను జోడు తోడుగుకుని నిలువబడుడి. నీవు విస్వాసివి కావొచ్చు, సేవకుడవు కావొచ్చు సమాధాన సువార్త వలన సిద్ధమనస్సు ఉంటేనే నీవు క్రీస్తుతో కూడా పైకి మధ్యకాసానికి ఎక్కగాలవు, ప్రార్ధించ గలవు, నీ శత్రువును ఎదుర్కొన గలవు. నీ మోకాళ్ళ అనుభవాన్ని పాడుచేస్తున్న ప్రతి విధమైన తంత్రములు, ఆలోచనలు, క్రియలు, నీ జీవితం లో లయమగును గాక! నీవు ప్రభువును ఎదుర్కోను బలము పొందుధువు గాక! నిన్ను బలవంతుణ్ణి చేసే సిద్ధమనసు పొందుదువు గాక!

మీ కొరకు  ప్రార్ధించే,

 షలోమ్ 

అపోస్తులు: నెల్లి నాని బాబు 


Sunday, December 22, 2019

మందిరానికి ఏప్పుడు వెళ్ళాలి?


ఈరోజు పునరుధాన దినం ఆరాధనా రోజు, కుటుంబముగా కలసి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారని అసిస్తున్నాను. యొహోషువ అన్నట్టు నేనును నా ఇంటివారును యెహోవాను సేవించేధము, అనుకుంటూ వెళ్తున్నారని ప్రార్ధిస్తున్నాను.  అయితే ప్రార్ధనకు ఏప్పుడు వెళ్తున్నారు అనేది ఒక ప్రాముఖ్యమయింది.  చాల మంది పనులు చక్కపెట్టుకుని, చుట్టాలను చక్కపెట్టి, వారమంతా మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేసుకుని పాటలు అయిపోయకో, స్తుతి ఆరాధన అయిపోయకో, ప్రసంగం సగం అయిపోయకో వెళ్ళడం అలవాటుగా మారిపోయింది కొంతమందికి. కాని వాక్యాన్ని బట్టి చూస్తే మందిరానికి ఆసక్తితో వెళ్ళాలి అని అర్ధం అవుతుంది. ఆసక్తి అంటే ఉదాహరణకు మనకు ఇష్టమయిన టీవీ ప్రోగ్రాం చూడటానికి సిద్ధపడినట్టు, ఉద్యోగానికి వెళ్లినట్టు, అలాగే ఇంటికి చుట్టం వస్తే ఎదురు చూస్తున్నట్టు, అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ కలవాడానికి వెళ్లినట్టు.  వీటన్నిటికి ఇచ్చినంత కంటే ఎక్కువ ప్రాధాన్యత మందిరానికి ఇవ్వలేకపోతున్నాము. కారణం మందిరం అంటే చులకన భావం. వాక్యం చెపుతుంది ఆరాధన జరిగే స్థలములో దేవుడు నిలిచి ఉంటాడు. మరి అయన పైవారందరి కంటే గొప్పవాడు కాదా? మరి అలాంటప్పుడు ఇంకెంత శ్రద్ధతో మందిరానికి వెళ్ళాలి. అందుకే వాక్యం లో రెండు వచనాలు చూద్దాం. ఒకటి లూకా 21:38 ప్రజలందరు ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. అలాగే మనకు మాదిరి వదిలిన యేసువారు ఏమిచేసారో కుడా చూద్దాం... యోహాను 12: 1 కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. యేసు వారు మందిరం లో జరిగే పండుగకు ముదుగా వెళ్లారు, ప్రజలు ఆయన వాక్యం వినడానికి ముందుగా, పెందలకడనే వచ్చారు. మరి నీవు ఎలా వెళ్తున్నావు? అది క్రమమేనా? అది నీకు దీవెన తెచ్చిపెడుతుందా? ఎశావు తండ్రికి ఆహారం తేవడం ఆలస్యం అయ్యింది, నాది నాకు ఉంటుందిలే అనుకున్నాడు, ఇంతలో ఆసిర్వదాలన్ని తమ్ముడు పట్టుకుని వెళ్ళిపోయాడు,  ఇక మిగిలింది.  పైన చెప్పిన వాటన్నిటికీ కుదురుతున్న సమయం దినికేందుకు కుదరదు? కుదురుతుంది. అలా సిద్ధపడి పెందలకడనే, ప్రారంబ ప్రార్ధనకు ముందుగానే  వెళ్లి దైవ దీవెనలు పొందగలరని ఆసిస్తూ.....

షలోమ్

మీకోరకు ప్రార్ధించే               
అపోస్తులు నెల్లి  నాని బాబు 


Friday, December 20, 2019

కుటుంబం లో నమ్మకత్వం




ఈరోజుల్లో మానవుని లో బాగా కరువైపోతుంది నమ్మకత్వం. అదువల్లె ఏ చిన్న విషయానికైనా  నోట్ లు, కాల్ రికార్డింగ్ లు, వీడియో లు, ఇద్దరు ముగ్గురు సాక్షులు కావలసి వస్తుంది. ఇంకా ఆలోచిస్తే కుటుంబాలలో కూడా ఇది కరువైపోతుంది. ఒక విచిత్రమైన సంగటన మీకు చెపుతాను. మునిమనవల్లను ఎత్తుకుని కాలక్షేపంగా సమయాన్ని గడపాల్సిన 99, 96 సంవత్సరాల ఇటలి  వృద్ధ దంపతులు అంటోనియో సి., రోసా సి. కోర్టు మెట్లు ఎక్కారు. ఎందుకో తెలుసా? 1940 లో బార్య కలిగిన అక్రమసంబంధం గురుంచి తెలిసి పెళ్ళైన 77 సంవత్సారాల తరువాత విడాకులు తీసుకుని ప్రపంచం లోనే విడాకులు తీసుకున్న వృద్ధ దంపతులుగా నమోదయ్యారు. నమ్మకత్వం అనేది చాలవిలువైన లక్షణం, అది కొనలేము, పొందుకోవాలి, కాపాడుకోవాలి. ఒక్కసారి కోల్పోతే మరల దానిని పొందుకోవడం అసంభవం. నమ్మకాలు కోల్పోయిన బార్య భర్తల మధ్య ఉండేది ప్రేమ కాదు నటనా జీవితం. ప్రతి మాట, ప్రతి క్రియ ఒక నటనే.... ఒకసారి అలోసించండి, మీ జీవితాకాలం మీరిద్దరే కలసి బ్రతకాలి, ఒకే ఇంట్లో,ఒకే గదిలో, ఒకే బోజన గదిలో కలసి సచ్చేవరకు ఉండాలి, కలసి ప్రయాణాలు, కలసి నిర్ణయాలు తీసుకోవాలి, కుదురుతుందా ఇదంతా నటనతో?  నమ్మకత్వాన్ని కోల్పోయే ఏవిధమైన క్రియ అయిన దాయ బడదు ఒక రోజు నీముందు నిలబడుతుంది. లూకా 8:17 తేట పరచబడని రహస్యమేదియు లేదు; తెలియజేయబడకయు బయలు పడకయు నుండు మరుగైనదేదియు లేదు. అప్పుడు నీవు తల ఎత్తుకుని నిలబదగలవా? దానికి ప్రతిఫలం పొందే సమయం లో నీవు ఒర్వగలవా? అవమానము సహించగలవా? అందుకే వాక్యం చెపుతుంది. మరణము వరకు నమ్మకముగా ఉండుము. ప్రకటన 2:10.., నమ్మకమయిన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28:20. అయన వెక్కిరింప బడడు. ఆయనే నీకు ప్రతిఫలము ఇస్తారు. నిజమైన ప్రేమను పొందుకుని ఆనదంగా మీరు మీ కుటుంభం ఉండును గాక!
షలోమ్
మీకోరకు ప్రార్ధించే           
అపోస్తులు నెల్లి  నాని బాబు

( source )